రజినీకాంత్ ‘కాలా’ ఆడియో రిలీజ్ డేట్

Monday,April 30,2018 - 02:40 by Z_CLU

పా. రంజిత్ డైరెక్షన్ లో తెరకెక్కింది రజినీకాంత్ ‘కాలా’ మూవీ. ‘కబాలి’ తరవాత మరోసారి సెట్స్ పైకి వచ్చిన ఈ కాంబో మోస్ట్ అవేటెడ్ మూవీస్ లిస్టులో ఉంది. జూన్  7  న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా  ఆడియో ని మే 9 న రిలీజ్ చేస్తున్నారు.

గతంలో రజినీకాంత్ ‘కబాలి’ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేసిన సంతోష్ నారాయణ్ ఈ సినిమాకి ట్యూన్స్ కంపోజ్ చేశాడు. దాంతో ఫ్యాన్స్ లో  న్యాచురల్ గానే ఈ సాంగ్స్ తో పాటు, BGM పై కూడా భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమాలో ముంబై లోని ధారావి ని రూల్ చేసే డాన్ లా కనిపించనున్న రజినీకాంత్.

హుమా ఖురేషి తో పాటు నానా పటేకర్ కీ రోల్స్  ప్లే చేస్తున్న ఈ సినిమాలో సముథిర ఖని, పంకజ్ త్రిపాఠి మరో స్పెషల్ రోల్స్ లో కనిపించనున్నారు. వండ‌ర్ బార్స్ బ్యాన‌ర్‌పై హీరో ధ‌నుశ్ నిర్మించిన  ఈ సినిమాకు లైకా ప్రొడ‌క్ష‌న్స్ స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తుంది.