క్యూరాసిటీ రేజ్ చేస్తున్న మహేష్ బాబు సినిమా

Monday,June 18,2018 - 02:18 by Z_CLU

వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కనున్న మహేష్ బాబు 25 వ మూవీ షూటింగ్ బిగిన్ అయింది. సినిమా సెట్స్ పైకి రాకముందే ఎగ్జోటిక్ లొకేషన్స్ ని ఫిక్స్ చేసుకున్న వంశీ పైడిపల్లి, ఈ రోజు నుండి డెహ్రాడూన్ లో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ బిగిన్ చేశాడు. అయితే ఫ్యాన్స్ కాన్సంట్రేషన్ మాత్రం ఈ సినిమా స్టోరీలైన్ పై ఫిక్సయి ఉంది.

రీసెంట్ గా మహేష్ బాబు ఒక ఈవెంట్ కి అటెండ్ అవ్వడంతో ఈ సినిమాలో మహేష్ బాబు లుక్స్ పై క్రియేట్ అయిన సస్పెన్స్ కి చెక్ పడింది. అయితే ఇప్పుడు ఆ స్పేస్ లో, వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా స్టోరీలైన్ ఏమై ఉంటుందనే డిస్కర్షన్స్  సోషల్ మీడియాలో భారీ స్పేస్ క్రియేట్ చేసుకుంటున్నాయి. దానికి తోడు అల్లరి నరేష్, మహేష్ బాబు కాంబినేషన్ లో ఉండబోయే సీన్స్ పై ఫ్యాస్స్ లో హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.

ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజర్. ఈ సినిమాని అశ్వినిదత్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.