మిక్కీ జె. మేయర్ ఇంటర్వ్యూ

Monday,April 30,2018 - 06:08 by Z_CLU

రేపు గ్రాండ్ గా మహానటి ఆడియో లాంచ్ జరగనుంది. ఇప్పటికే రిలీజైన 2 సాంగ్స్ సూపర్ హిట్టయ్యాయి. సినిమాలోని ప్రతి సాంగ్, సినిమాకి ఎసెట్ అవుతుందని కాన్ఫిడెంట్ గా ఉన్న మ్యూజిక్ కంపోజర్ మిక్కీ. జె. మేయర్ ఈ సినిమాకు సంబంధించి చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. అవి మీకోసం…

 

మైల్ స్టోన్ మూవీ…

‘మహానటి’ సినిమా డెఫ్ఫినేట్ గా నా కరియర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలిచిపోతుంది. ఇది సావిత్రి గారి జెన్యూన్ కథ. సావిత్రి గారి గురించి తెలియని వాళ్ళు ఎవరూ లేరు. కానీ అందరికీ ఆవిడ గురించి కంప్లీట్ గా తెలీదు. అలాంటి మహానటి బయోపిక్ లో నాకు చాన్స్ దొరకడం నిజంగా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను.

పెద్ద చాలెంజ్ అనిపించింది…

దాదాపు 1 ఇయర్ గా ఈ సినిమాతో ట్రావెల్ చేస్తున్నాను. ఈ సినిమాకు పని చేయడం చాలా చాలెంజింగ్ గా అనిపించింది. రీసెంట్ గా రిలీజైన 2 సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తక్కిన సాంగ్స్ కూడా అందరికీ నచ్చుతాయని కాన్ఫిడెంట్ గా ఉన్నా…

న్యూట్రల్ జోనర్ లో సాంగ్…

ఈ సినిమా సాంగ్స్ వరకు వచ్చేసరికి వింటేజ్ ఫీల్ ఉండాలి దాంతో పాటు మాడరన్ గా కూడా ఉండాలి. అల్టిమేట్ గా సాంగ్స్ అన్నీ న్యూట్రల్ జోనర్ లో ఉండేలా చూసుకున్నాము…

 

రీసర్చ్ చేశాను…

ఈ సినిమా మ్యూజిక్ కంపోజ్ చేసేటప్పుడు రిఫరెన్స్ లాంటివి తీసుకోలేదు కానీ, సావిత్రి గారి చాలా సినిమాలు చూశాను. ఆ తరవాత సాంగ్స్ కంపోజ్ చేసుకున్నాను…

రీమిక్స్ ఉంటాయి…

సావిత్రి గారి చాలా సాంగ్స్ రీమిక్స్ చేశాం. అందులో ఏవి ఫైనల్ గా డైరెక్టర్ చూజ్ చేసుకున్నారో తెలీదు కానీ, ఆ సాంగ్స్ ని నేను పెద్దగా చేంజ్ చేయలేదు, స్పాయిల్ చేయలేదు, జస్ట్ కొన్ని అడిషనల్ ప్రోగ్రామ్స్ ఆడ్ చేశాం అంతే…

కొన్ని సీన్స్ కోసం…

సావిత్రి గారు షూటింగ్ టైమ్ లో ఉండే సిచ్యువేషన్స్ లో ఆప్పటి సాంగ్స్ ప్లే చేయాల్సి వచ్చినప్పుడు మాత్రమే ఓల్డ్ సాంగ్స్ ఉంటాయి..

చాలా గ్రేట్…

నాగ్ అశ్విన్ నాకు ‘లీడర్’ సినిమా అప్పటి నుండి తెలుసు. ఆ తరవాత ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చేసేటప్పుకు కూడా ఉన్నాడు. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. నాగ్ అశ్విన్ చాలా ట్యాలెంటెడ్. ఇలాంటి సినిమాను పిక్ చేసుకోవడం, అందునా ప్రొడ్యూసర్స్ ని కన్విన్స్ చేసుకోవడం నిజంగా గ్రేట్.

 

మ్యూజిక్ ఈ సినిమాకి సోల్…

ఈ సినిమాకి మ్యూజిక్ సోల్… కీర్తి సురేష్ తో పాటు ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ సినిమాకి బిగ్గెస్ట్ ఎసెట్స్.

అన్నీ కమర్షియల్ హిట్సే…

నాకు మాస్ మసాలా సినిమాలకు పని చేయడం అంటే పెద్దగా ఇష్టం ఉండదు. ఎవరైనా హ్యాప్పీగా ఉన్నపుడు నా సాంగ్స్ వినాలి, స్యాడ్ గా ఉన్నప్పుడు వినగలగాలి. మ్యూజిక్ కంపోజర్ గా నాకు నచ్చిన మ్యూజిక్ నే, నా టైప్  మ్యూజిక్ నే కంపోజ్ చేద్దామనుకుంటున్నాను.

 

మరో హ్యాప్పీడేస్ మూవీ రాదు…

ప్రతి మ్యూజిక్ కంపోజర్ లైఫ్ లో ఒక టర్నింగ్ పాయింట్ మూవీ ఉంటుంది. నా లైఫ్ లో హ్యాప్పీడేస్ అలాంటిది. మరో హ్యాప్పీడేస్ రాదు…

నెక్స్ట్ మూవీస్…

ప్రస్తుతం ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా చేస్తున్నాను. దీంతో పాటు ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో సినిమా చేస్తున్నాను. దిల్ రాజు గారితో మహేష్ బాబు నెఫ్యూ RK  డైరెక్షన్ లో సినిమా ఉంటుంది.