మహర్షి - సస్పెన్స్ లో ఉన్న ఎలిమెంట్స్

Saturday,April 20,2019 - 11:02 by Z_CLU

‘మహర్షి’ నుండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. ఫిల్మ్ మేకర్స్ ఏ చిన్న అప్డేట్ ఇచ్చినా, ఈ సినిమాకి సంబంధించి ఏదైనా కొత్త విషయం రివీల్ చేస్తారేమోనన్న ఫ్యాన్స్ లో రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. దానికి తోడు ‘మహర్షి’ టీమ్ సినిమాకి సంబందించిన క్రూస్హళ్ ఇన్ఫర్మేషన్ ని ఏ మాత్రం బయటికి రానివ్వకుండా సస్పెన్స్ మెయిన్ టైన్ చేస్తుంది. ప్రస్తుతానికి ‘మహర్షి’ ని హాట్ టాపిక్ జోన్ లో పెడుతున్న మోస్ట్ సస్పెన్స్ ఎలిమెంట్స్ ఇవే.

స్టోరీలైన్ : ఇప్పటి వరకు 2 టీజర్స్ రిలీజయ్యాయి. ఒకదాని తరవాత ఒకటి సాంగ్స్ కూడా రిలీజవుతున్నాయి కానీ స్టోరీలైన్ మాత్రం కించిత్ కూడా బయటికి రాలేదు. అప్పడెప్పుడో కొంచెం రైతుల బ్యాక్ డ్రాప్ లో కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయనే టాక్ వచ్చినా, ఏ కన్ఫర్మేషన్ లేదు. అసలు ‘మహర్షి’ కథ ఏ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుందనేది పెద్ద సస్పెన్స్ ఎలిమెంట్.

అల్లరి నరేష్ రోల్ : ఈ అల్లరోడు ‘మహర్షి’ లో ఏం చేస్తాడో ఏంటో..? మొన్నా మధ్య రిలీజైన 2 స్టిల్స్ ని బట్టి హీరో కాలేజ్ డేస్ లో ఫ్రెండ్ అని తెలుస్తుంది. అది సరే… కథలో నరేష్ ప్లే చేసిన క్యారెక్టర్ ఏ స్థాయిలో కీ రోల్ ప్లే చేయబోతుంది..? ఇంతమంది కీ రోల్ ప్లే చేసే నటులుండగా వంశీ పైడిపల్లి అల్లరి నరేష్ నే ఎందుకు ఎంచుకున్నట్టు..?

చాలెంజింగ్ ఎలిమెంట్స్ : మొత్తం 3 గెటప్స్ లో కనిపిస్తాడట మహేష్ బాబు ఈ సినిమాలో. కాలేజ్ స్టూడెంట్ లా యంగ్ వర్షన్ రివీల్ అయింది. బిజినెస్ మ్యాన్ లా క్లాస్ లుక్ లో లుక్స్ కూడా రివీల్ అయ్యాయి. అయినా ఇక్కడ లుక్స్ కాదు. కాలేజ్ డేస్ నుండి బిజినెస్ టైకూన్ అనిపించుకునే ప్రాసెస్ లో ‘మహర్షి’ ట్రావెల్ చేసే చాలెంజింగ్ ఎలిమెంట్ ఏంటి..? అసలు మహర్షి ఎదురుగా ఉండబోయే చాలెంజింగ్ ఎలిమెంట్స్ ఏంటి..? సస్పెన్సే మరీ..

పూజా హెగ్డే : క్యారెక్టర్ కి కొద్దో గొప్పో ఇంపార్టెన్స్ లేకపోతే సినిమాకి సంతకం చేయదు పూజా హెగ్డే. ఈ సినిమాలో కూడా పూజా ఇంపాక్ట్ క్రియేట్ చేసే రోల్ ప్లే చేసిందనే టాక్ అయితే ఇప్పటికే ఉంది. అదే ఏంటి..? గ్లామర్, సాంగ్స్ ఓకె… కానీ, ఈ క్యారెక్టర్ మహర్షి క్యారెక్టర్ పై ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందనేది ఇప్పటికి సస్పెన్సే…

అసలు విషయం : ఇంకా వేరే స్టోరీస్, డైరెక్టర్స్ లైనప్ అయి ఉన్నా మహేష్ బాబు ఈ సినిమాని 25 వ సినిమాగా ఫిక్సయ్యాడు. అంతగా సూపర్ స్టార్ ని కదిలించిన పాయింట్ ఏంటి..? ఈ కథకి ఆ స్థాయిలో ఎందుకు ఇంపార్టెన్స్ ఇచ్చాడన్నది డెఫ్ఫినెట్ గా మ్యాటరే. అది కూడా ప్రస్తుతానికి సస్పెన్సే.