జెర్సీ ఫస్ట్ డే కలెక్షన్

Saturday,April 20,2019 - 01:42 by Z_CLU

జెర్సీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు మూవీని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని నటించిన ఈ మోస్ట్ ఎమోషనల్ డ్రామా.. ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయిపోయింది.

మొదటి రోజు ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 4 కోట్లు 48 లక్షల రూపాయల షేర్ వచ్చింది. వరల్డ్ వైడ్ చూసుకుంటే ఈ మూవీకి 7 కోట్లు 32 లక్షల రూపాయల కలెక్షన్ వచ్చింది. సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో.. రాబోయే రోజుల్లో జెర్సీకి కళ్లుచెదిరే లాభాలు రావడం గ్యారెంటీ.

ఏపీ, నైజాం ఫస్ట్ డే షేర్
నైజాం – రూ. 1.90 కోట్లు
సీడెడ్ – రూ. 0.40 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.55 కోట్లు
ఈస్ట్ – రూ. 0.36 కోట్లు
వెస్ట్ – రూ. 0.29 కోట్లు
గుంటూరు – రూ. 0.41 కోట్లు
కృష్ణా – రూ. 0.34 కోట్లు
నెల్లూరు – రూ. 0.17 కోట్లు