మైల్ స్టోన్ దిల్ రాజు

Friday,May 03,2019 - 12:02 by Z_CLU

దిల్ రాజు సినిమా అంటే మినిమం గ్యారంటీ సక్సెస్. ఈ బ్యానర్ లో సినిమా వచ్చిందంటే  ఫ్యామిలీ ఆడియెన్స్ కి పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ రిలీజైందని ఫిక్సయిపోతారు ప్రేక్షకులు. అయితే ఇప్పుడు దిల్ రాజు జస్ట్ మంచి సినిమాల నిర్మాత మాత్రమే కాదు.. మైల్ స్టోన్ నిర్మాత అని కూడా అనిపించుకున్నాడు.

మహేష్ కరియర్ లో ‘మహర్షి’ డెఫ్ఫినెట్ గా ప్రెస్టీజియస్ మూవీనే. ఇనాళ్ళ సినిమా కరియర్ ఒక లెక్క. భారీ అంచనాల మధ్య వస్తున్న ‘మహర్షి’ మరో లెక్క. ఎందుకంటే ఫ్యాన్స్ లో క్రియేట్ అయ్యే అంచనాలు ఆ స్థాయిలో ఉన్నాయి. ఈ సినిమాను అశ్వనీదత్, PVP తో కలిసి నిర్మించాడు దిల్ రాజు. అలా మహేష్ కరియర్ లోని మైల్ స్టోన్ మూవీలో భాగమయ్యాడు. ఈ వరసలో నాని మైల్ స్టోన్ సినిమా బాధ్యత కూడా తనే తీసుకున్నాడు.

రీసెంట్ గానే గ్రాండ్ గా లాంచ్ అయింది నాని 25వ సినిమా. ఈ సినిమాని కూడా దిల్ రాజు నిర్మిస్తున్నాడు. నాని, మోహన కృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో సినిమా అనగానే క్రియేట్ అయిన వైబ్స్, ప్రొడ్యూసర్ దిల్ రాజు అనగానే మరింత పాజిటివ్ గా ట్రాన్స్ ఫామ్ అయ్యాయి.

మైల్ స్టోన్ సినిమా అంచనాలను అందుకోవడం ఆషామాషీ కాదు. కానీ దిల్ రాజు మాత్రం ఆ ప్రెజర్ ని ఈజీగా హ్యాండిల్ చేస్తాడు. ఫ్యాన్స్ పల్స్ ఒక్కటే కాదు ఇండస్ట్రీ ట్రెండ్స్ ని కూడా మైండ్ లో పెట్టుకుని సినిమాలు తీసే ఈ బ్రాండెడ్ ప్రొడ్యూసర్ ఇక నుండి మైల్ స్టోన్ సినిమాల ప్రొడ్యూసర్ అనిపించుకుంటున్నాడు.