యంగ్ టైగర్ మెచ్చిన జెర్సీ

Saturday,April 20,2019 - 10:32 by Z_CLU

కేవలం క్రిటిక్స్ ను మెప్పించడమే కాదు, కామన్ ఆడియన్స్ కు కూడా తెగ నచ్చేసింది జెర్సీ సినిమా. నాని, శ్రద్ధా శ్రీనాధ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మోస్ట్ ఎమోషనల్ మూవీ మొదటి రోజు మొదటి ఆటకే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. మరోవైపు ఇండస్ట్రీ జనాలు కూడా సినిమా చూసి ఫిదా అవుతున్నారు. ఈ లిస్ట్ లో ఎన్టీఆర్ కూడా ఒకడు.

జెర్సీ సినిమా చూసిన ఎన్టీఆర్, సినిమాను ఆకాశానికెత్తేశాడు. యూనిట్ లో ప్రతి ఒక్కర్ని మెచ్చుకున్నాడు. గౌతమ్ తిన్ననూరి రైటింగ్ అద్భుతంగా ఉందన్నాడు. ఇక నాని కోసమైతే ప్రత్యేకంగా ఓ ట్వీట్ ను అంకితమిచ్చాడు ఎన్టీఆర్. బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ అంటూ కొనియాడాడు

ప్రస్తుతం థియేటర్లలో జెర్సీ సినిమా సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. కేవలం ఎన్టీఆర్ మాత్రమే కాకుండా, పరిశ్రమకు చెందిన ఎంతోమంది ప్రముఖులు పోస్టులు పెడుతున్నారు. చాలామంది నానికి, నిర్మాతలకు ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందనలు చెబుతున్నారు.