'మ‌హ‌నుభావుడు' టైటిల్ సాంగ్ రిలీజ్ డీటెయిల్స్

Wednesday,September 06,2017 - 06:04 by Z_CLU

శ‌ర్వానంద్ హీరోగా, మెహ్రీన్ హీరోయిన్ గా, మారుతి ద‌ర్శ‌క‌త్వంలో యు.వి.క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో వంశీ, ప్ర‌మొద్ లు సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్న చిత్రం ‘మ‌హ‌నుభావుడు’. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాలోని టైటిల్ సింగల్ ను రేపు ఉదయం 8.45 నిమిషాలకు విడుదల చేయనున్నారు మేకర్స్.

త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించి థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విజ‌య‌ద‌శ‌మికి చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. మ్యూజిక‌ల్ ల‌వ్ స్టోరి గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు థ‌మ‌న్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.