జీ సినిమాలు (7th సెప్టెంబర్)

Wednesday,September 06,2017 - 10:02 by Z_CLU

ధర్మచక్రం

నటీనటులు : వెంకటేష్, రమ్య కృష్ణన్, ప్రేమ

ఇతర నటీనటులు : గిరీష్ కర్నాడ్, శ్రీ విద్య, D. రామానాయుడు

మ్యూజిక్ డైరెక్టర్ : M.M.శ్రీలేఖ

డైరెక్టర్ : సురేష్ కృష్ణ

ప్రొడ్యూసర్ : D. రామానాయుడు

రిలీజ్ డేట్ : 13 జనవరి 1996

విక్టరీ వెంకటేష్ నటించిన సూపర్ సెన్సేషనల్ హిట్ ధర్మచక్రం. డబ్బుందన్న అహంతో తన ప్రేమను తనకు దక్కకుండా చేసిన తండ్రికి తగిన గుణపాఠం చెప్పే కొడుకుగా వెంకటేష్ నటన సినిమాకి హైలెట్. సురేష్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి M.M.శ్రీలేఖ సంగీతం అందించారు.

==============================================================================

కథా నాయకుడు

నటీనటులు : రజినీ కాంత్, జగపతి బాబు, మీనా, నయన తార

ఇతర నటీనటులు : మమత మోహన్ దాస్, ప్రభు, విజయ్ కుమార్, బ్రహ్మానందం, ఆలీ, సునీల్, M.S.నారాయణ

మ్యూజిక్ డైరెక్టర్ : G.V. ప్రకాష్ కుమార్

డైరెక్టర్ : P.వాసు

ప్రొడ్యూసర్ : C. అశ్విని దత్

రిలీజ్ డేట్ : 1 ఆగష్టు 2008

ఒక ఇమోషనల్ కథాంశంతో తెరకెక్కిందే కథానాయకుడు సినిమా. సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఫ్రెండ్ గా నటించాడు జగపతి బాబు ఈ సినిమాలో. ఒక పెద్ద స్టార్ కి, ఒక మధ్య తరగతి సాధారణ వ్యక్తికి మధ్య ఉండే స్నేహానికి ప్రతిబింబమే ఈ కథా నాయకుడు. ఈ సినిమాకి P. వాసు డైరెక్టర్.

==============================================================================

మేము

నటీనటులు : సూర్య, అమలా పాల్

ఇతర నటీనటులు : రామ్ దాస్, కార్తీక్ కుమార్, విద్యా ప్రదీప్, బిందు మాధవి, నిశేష్, వైష్ణవి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : ఆరోల్ కోలేరి

డైరెక్టర్ : పాండిరాజ్

ప్రొడ్యూసర్స్ : సూర్య, పాండిరాజ్

రిలీజ్ డేట్ : 24th డిసెంబర్ 2015

పిల్లల్లో హైపర్ ఆక్టివిటీని ఎలా హ్యాండిల్ చేయాలి అనే సెన్సిటివ్ టాపిక్ తో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మేము. ఈ సినిమాలో సూర్య, అమలా పాల్ నటన హైలెట్ గా నిలిచింది.

=============================================================================

 

మొగుడు

నటీనటులు : గోపీచంద్, తాప్సీ పన్ను

ఇతర నటీనటులు : శ్రద్ధా దాస్, రాజేంద్ర ప్రసాద్, రోజా, నరేష్, ఆహుతి ప్రసాద్, వేణు మాధవ్

మ్యూజిక్ డైరెక్టర్ : బాబు శంకర్

డైరెక్టర్ : కృష్ణవంశీ

ప్రొడ్యూసర్ : నల్లమలుపు బుజ్జి

రిలీజ్ డేట్ : 4 నవంబర్ 2011

కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన మొగుడు  పక్కా రొమాంటి ఎంటర్ టైనర్. ఈ సినిమాలో గోపీచంద్, తాప్సీ జంటగా నటించారు. తండ్రి, అక్కా చెల్లెళ్ళ కోసం భార్యను వదులుకున్న హీరో, తిరిగి తనను తన లైఫ్ లోకి ఎలా తెచ్చుకుంటాడు అన్నదే ప్రధాన కథాంశం.

=============================================================================

కొత్త బంగారు లోకం

నటీనటులు : వరుణ్ సందేశ్, శ్వేత బసు ప్రసాద్

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, జయసుధ, ఆహుతి ప్రసాద్, రజిత, బ్రహ్మానందం మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మిక్కీ జె. మేయర్

డైరెక్టర్ : శ్రీకాంత్ అడ్డాల

ప్రొడ్యూసర్ : దిల్ రాజు

రిలీజ్ డేట్ : 9 అక్టోబర్ 2008

శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో తెరకెక్కిన కొత్త బంగారు లోకంలో వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ హీరో హీరోయిన్ గా నటించారు. రిలీజయిన ప్రతి సెంటర్ లోను అల్టిమేట్ బ్లాక్ బస్టర్ అనిపించుకున్న ఈ సినిమాకి దిల్ రాజు ప్రొడ్యూసర్. మిక్కీ జె. మేయర్ మ్యూజిక్ సినిమాకే హైలెట్.

=============================================================================

 

ధీరుడు

నటీనటులు : విశాల్, ఐశ్వర్య అర్జున్

ఇతర నటీనటులు : సంతానం, జగన్, జాన్ విజయ్, ఆదిత్య ఓం, మురళి శర్మ, సీత తదితరులు.

మ్యూజిక్ డైరెక్టర్ : తమన్

డైరెక్టర్ : భూపతి పాండ్యన్

ప్రొడ్యూసర్ : మైకేల్ రాయప్పన్

రిలీజ్ డేట్ : 26 జూలై 2013

సినిమా సినిమాకి వైవిధ్యం ఉండేలా జాగ్రత్త పడతాడు విశాల్. సీనియర్ నటుడు అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా నటించిన తొలి తమిళ చిత్రం “పట్టాతు యానై” సినిమాకి డబ్బింగ్ వర్షన్ ఈ ధీరుడు. ఈ సినిమా రెండు భాషలలోను ఒకేసారి రిలీజయింది. సంతానం కామెడీ సినిమాకే హైలెట్ గా నిలిచింది.