'మహానుభావుడు' ప్రీ రిలీజ్ ఈవెంట్ డీటెయిల్స్

Thursday,September 21,2017 - 06:14 by Z_CLU

బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ తో దూసుకెళ్తున్న శర్వానంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మహానుభావుడు’ రిలీజ్ కి రెడీ అయింది. ఇటీవలే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 29న థియేటర్స్ లోకి రానుంది. ఈ సందర్భంగా ఈ నెల 24న గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. యూనిట్ తో పాటు పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఈ ఈవెంట్ జరగనుంది.


యు.వి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ , ప్రమోద్ నిర్మాణంలో మ్యూజికల్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో శర్వా సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటించగా థమన్ మ్యూజిక్ అందించాడు. ఇప్పటికే రిలీజయిన సాంగ్స్, ట్రైలర్ సినిమాకు పాజిటీవ్ క్రియేట్ చేస్తూ అందరినీ ఎట్రాక్ట్ చేస్తుంది.