జీ సినిమాలు (22 సెప్టెంబర్)

Thursday,September 21,2017 - 11:15 by Z_CLU

నేనేం చిన్నపిల్లనా..?

నటీనటులు : రాహుల్ రవీంద్రన్, తన్వి వ్యాస్

ఇతర నటీనటులు : సంజనా గల్రాణి, శరత్ బాబు, సుమన్, రఘుబాబు, L.B.శ్రీరామ్, కాశీ విశ్వనాథ్

మ్యూజిక్ డైరెక్టర్ : M.M.శ్రీలేఖ

డైరెక్టర్ : P. సునీల్ కుమార్ రెడ్డి

ప్రొడ్యూసర్ : D. రామానాయుడు

రిలీజ్ డేట్ : 8 నవంబర్ 2013

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన మరో సూపర్ హిట్ ఫిలిం ‘నేనేం చిన్నపిల్లనా..’. నిజానికి దర్శక నిర్మాతలు ఈ సినిమాకి టైటిల్ ‘పట్టుదల’ అని డిసైడ్ అయ్యారు. తీరా సినిమా రిలీజ్ కి దగ్గర పడ్డాక ‘నేనేం చిన్నపిల్లనా’ టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో రాహుల్ రవీంద్రన్, తన్వి వ్యాస్ హీరో హీరోయిన్ లు గా నటించారు. M.M.శ్రీలేఖ సంగీతం అందించారు.

==============================================================================

అదిరిందయ్యా చంద్రం

హీరో హీరోయిన్లు – శివాజీ, లయ

ఇతర నటీనటులు – సంగీత, మధుశర్మ, బ్రహ్మానందం, అలీ, వేణుమాధవ్, ఏవీఎస్

సంగీతం – ఎం.ఎం.శ్రీలేఖ

స్క్రీన్ ప్లే, దర్శకత్వం – శ్రీనివాసరెడ్డి

విడుదల తేదీ – 2005, ఆగస్ట్ 20

బ్యానర్ – ఎస్పీ క్రియేషన్స్

శివాజీ, లయ కలిసి నటించిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అదిరిందయ్యా చంద్రం.  శివాజీ కెరీర్ లో సూపర్ హిట్ సినిమాల్లో ఒకటిగా ఇది నిలిచిపోతుంది. శివాజీలో అదిరిపోయే కామెడీ టైమింగ్ ఉందని మరోసారి నిరూపించింది ఈ సినిమా.

==============================================================================

 

భలే దొంగలు

నటీనటులు – తరుణ్, ఇలియానా

ఇతర నటీనటులు – జగపతి బాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ప్రదీప్ రావత్, బ్రహ్మానందం, సునీల్, ఎం.ఎస్.నారాయణ  తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ – కె.ఎం.రాధా కృష్ణన్

నిర్మాత – శాఖమూరి పాండు రంగారావు , బెల్లం కొండ సురేష్

దర్శకత్వం –  విజయ్ భాస్కర్

 విడుదల తేదీ – 11  ఏప్రిల్  2008

తరుణ్-ఇలియానా లతో దర్శకుడు విజయ్ భాస్కర్ తెరకెక్కించిన లవ్ & కామెడీ ఎంటర్టైనర్ సినిమా ‘భలే దొంగలు’. జగపతి బాబు ముఖ్య పాత్ర పోషించిన ఈ సినిమా లో తరుణ్-ఇలియానా మధ్య వచ్చే సీన్స్, ధర్మవరపు, సునీల్, బ్రహ్మానందం కామెడీ, రాధా కృష్ణన్ మ్యూజిక్ హైలైట్స్..

=============================================================================

శివయ్య

నటీనటులు : రాజశేఖర్, సంఘవి, మోనికాబేడి

ఇతర నటీనటులు : చలపతి రావు, అశోక్ కుమార్, రమాప్రభ, AVS, అనంత్, గిరిబాబు, వేణు మాధవ్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీ లేఖ

డైరెక్టర్ : సురేష్ వర్మ

ప్రొడ్యూసర్ : డా. డి. రామానాయుడు

రిలీజ్ డేట్ : 1998 మార్చి 27

ఆంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ శివయ్య. మోనికా బేడీ, సంఘవి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి సురేష్ వర్మ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో రవిబాబు విలన్ ఇంట్రడ్యూస్ అయ్యాడు.

==============================================================================

తడాఖా

నటీనటులు : నాగచైతన్య, సునీల్, తమన్నా, ఆండ్రియా జెరెమియా

ఇతర నటీనటులు : ఆశుతోష్ రానా, నాగేంద్ర బాబు, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రఘుబాబు, రమాప్రభ మరితు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S. తమన్

డైరెక్టర్ : కిషోర్ కుమార్ పార్ధసాని

ప్రొడ్యూసర్  : బెల్లంకొండ సురేష్

రిలీజ్ డేట్ : 10th మే 2013

నాగచైతన్య, సునీల్ అన్నాదమ్ములుగా నటించిన ఇమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ తడాఖా. తండ్రి చనిపోగానే వచ్చిన  పోలీసాఫీసర్ ఉద్యోగంలో ఇమడలేని అన్నకు తమ్ముడు ఎలా చేదోడు వాదోడుగా నిలిచాడు, కథ చివరికి మలుపు తిరిగిందనేదే సినిమా ప్రధాన కథాంశం.

==============================================================================

బుజ్జిగాడు

నటీనటులు : ప్రభాస్, త్రిష కృష్ణన్

ఇతర నటీనటులు : మోహన్ బాబు, సంజనా, కోట శ్రీనివాస రావు, M.S. నారాయణ, సునీల్, బ్రహ్మాజీ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : సందీప్ చౌతా

డైరెక్టర్ : పూరి జగన్నాథ్

ప్రొడ్యూసర్ : K. S. రామారావు

రిలీజ్ డేట్ : 23 మార్చి 2008

ప్రభాస్, త్రిష జంటగా నటించిన అల్టిమేట్ యాక్షన్ లవ్ ఎంటర్ టైనర్ బుజ్జిగాడు. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో మోహన్ బాబు కీ రోల్ ప్లే చేశారు. ప్రభాస్ డిఫెరెంట్ మ్యానరిజం సినిమాకి హైలెట్ గా నిలిచింది.