స్పైడర్ లో స్పెషల్ ఎట్రాక్షన్ అదే....

Thursday,September 21,2017 - 05:19 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్ – సెన్సేషనల్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన మోస్ట్ ఎవైటింగ్ మూవీ ‘స్పైడర్’ రిలీజ్ కి రెడీ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫైనల్ స్టేజికి చేరుకున్న ఈ సినిమా వచ్చే వారం నుంచే థియేటర్స్ లో భారీ హంగామా చేయబోతుంది. ఇంటెలిజెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాకు బ్యాగ్రౌండ్ స్కోర్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనుందట..

ఇప్పటికే సాంగ్స్ తో మెస్మరైజ్ చేసిన హారీస్ జయరాజ్ ఈ సినిమాకు అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ అందించాడట. ముఖ్యంగా మురుగదాస్ ఇంటలిజెన్స్ స్క్రీన్ ప్లే సీన్స్ కి బాగ్రౌండ్ స్కోర్ పెద్ద ఎస్సెట్ కానుందట. ఈ విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా స్వయంగా ఫాన్స్  కు తెలియజేసి ఈ రేంజ్ లో అవుట్ స్టాండింగ్ ఆర్.ఆర్ అందించినందుకు హారీస్ కి స్పెషల్ గా థాంక్స్ చెప్పాడు డైరెక్టర్ మురుగదాస్.

హై స్టాండర్డ్ టెక్నీకల్ వర్క్ తో మెస్మరైజ్ చేయబోతున్న స్పైడర్ లో విజువల్ ఎఫెక్స్ట్ తో పాటు సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్ అన్నీ ఓ రేంజ్ లో ఆకట్టుకుంటాయని సమాచారం. సో స్పైడర్ కేవలం కంటెంట్ పరంగానే కాకుండా టెక్నీకల్ గా కూడా ది బెస్ట్ మూవీ గా నిలవనుందన్నమాట.