జై లవకుశతో పాటు మహానుభావుడు కూడా..

Wednesday,August 23,2017 - 12:01 by Z_CLU

రేపు జై లవకుశ టీజర్ రిలీజ్ కానుందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీ హంగామాతో పాటు శర్వానంద్ నటిస్తున్న మహానుభావుడు సినిమా సందడి కూడా రేపట్నుంచే షురూ కానుంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రేపు ఉదయం 9గంటల 30నిమిషాలకు విడుదల చేయబోతున్నారు. పనిలోపనిగా ఫస్ట్ లుక్ టీజర్ ను కూడా లాంచ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు మారుతి స్వయంగా ప్రకటించాడు.

దసరా బరిలో శర్వానంద్ కూడా నిలిచాడు. జై లవకుశ సినిమా వచ్చేనెల 21న విడుదల అవుతుంటే.. మహానుభావుడు సినిమాను సెప్టెంబర్ 29న విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఈ సినిమాకు 2 రోజుల ముందే మహేష్ నటిస్తున్న స్పైడర్ వస్తోంది. ఇంత పోటీమధ్య కూడా మహానుభావుడు సినిమాను విడుదల చేయడానికే రెడీ అవుతున్నాడు శర్వానంద్.

యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో శర్వానంద్ సరసన మెహరీన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఒక్క సాంగ్ మినహా కంప్లీట్ అయింది. ఈనెలాఖరుకు అది కూడా పూర్తిచేయబోతున్నారు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సైమల్టేనియస్ గా సాగుతున్నాయి.