రేపే మహానుభావుడు రిలీజ్

Thursday,September 28,2017 - 11:38 by Z_CLU

ఓవైపు ఎన్టీఆర్ నటించిన జై లవకుశ సినిమా థియేటర్లలో నడుస్తోంది. మరోవైపు మహేష్ నటించిన మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ స్పైడర్ నిన్ననే థియేటర్లలోకి వచ్చేసింది. ఈ రెండు సినిమాల మధ్య రేపు రిలీజ్ అవుతోంది శర్వానంద్ నటించిన మహానుభావుడు సినిమా. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన మహానుభావుడు మూవీ, దసరా బరిలో నిలిచిన మూడో చిత్రం.

యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించాడు. పాటలు, ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై ఓ మోస్తరు అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలో శర్వానంద్ సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటించింది.

భలే భలే మగాడివోయ్ సినిమాలో నానికి మతిమరుపు అనే బలహీనత పెట్టిన మారుతి.. ఈ సినిమాలో శర్వానంద్ కు అతిశుభ్రత అనే బలహీతన పెట్టాడు. ఈ వీక్ నెస్ తో హీరో ఎలాంటి పాట్లు పడ్డాడు, చివరికి తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడనేదే స్టోరీ. జై లవకుశ, స్పైడర్ లాంటి రెండు పెద్ద సినిమాల మధ్య వస్తున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ సాధిస్తుందో చూడాలి.