టాలీవుడ్ లో మళ్ళీ బిజీ అవుతున్న నయనతార

Wednesday,August 23,2017 - 11:12 by Z_CLU

ఆ మధ్య టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా సత్తా చాటి తర్వాత కోలీవుడ్ కి షిఫ్ట్ అయి అక్కడ టాప్ హీరోయిన్ గా బిజీ అయిన నయనతార ప్రెజెంట్ టాలీవుడ్ లో మళ్ళీ వరుస బడా సినిమాల ఆఫర్స్ అందుకుంటూ దూసుకెళ్తుంది. తెలుగులో ‘బాబు బంగారం’ మినహా రీసెంట్ గా మరో సినిమాకు సైన్ చేయని ఈ భామ ప్రస్తుతం ఓ వైపు బాలయ్య సరసన హీరోయిన్ గా నటిస్తూనే మరో వైపు ‘సైరా నర్సింహా రెడ్డి’ సినిమాలో చిరుతో జత కట్టడానికి రెడీ అవుతుంది.

ప్రస్తుతం కె.ఎస్.రవి కుమార్ డైరెక్షన్ లో బాలయ్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్న నయన్ త్వరలోనే చిరు సినిమా సెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ రెండు బడా సినిమాలతో మళ్ళీ తెలుగులో తన సత్తా చాటి హవా కంటిన్యూ చేయబోతుంది నయన్. మరి ఈ రెండు సినిమాల తర్వాత  తెలుగులో మళ్ళీ ఈ భామ వరుస సినిమాలతో హంగామా చేస్తుందేమో..చూడాలి.