శ‌ర్వానంద్‌ "మ‌హ‌నుభావుడు" ఫ‌స్ట్‌లుక్ రిలీజ్ డేట్

Thursday,August 17,2017 - 12:01 by Z_CLU

శ‌ర్వానంద్, మెహరీన్ హీరోహీరోయిన్లుగా, మారుతి ద‌ర్శ‌క‌త్వంలో యు.వి.క్రియోష‌న్స్ బ్యాన‌ర్ పై తెరకెక్కుతున్న చిత్రం మహానుభావుడు. ఒక్క సాంగ్ మిన‌హ షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా పోస్ట్‌ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ఈరోజు నుండి డబ్బింగ్ కార్య‌క్ర‌మాలు స్టార్ట్ అయ్యాయి. ఇట‌లీ, ఆస్ట్రియా, క్రోయెషియా లాంటి విదేశాల్లో షూటింగ్ జ‌రుపుకుంది ఈ సినిమా. అగ‌ష్టు 24న ఈ చిత్రానికి సంభందించి ఫస్ట్ లుక్ అండ్ ఫస్ట్ లుక్ టీజ‌ర్ ని విడుద‌ల చేస్తున్నారు. ప‌క్కా ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ గా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది.

ర‌న్ రాజా ర‌న్‌, ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాల త‌రువాత యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై శ‌ర్వానంద్ హీరోగా చేస్తున్న మూడ‌వ చిత్రం మ‌హ‌నుభావుడు. మారుతి చెప్పిన కేర‌క్ట‌రైజేష‌న్ దాని నుండి వ‌చ్చిన కామెడి చాలా బాగా న‌చ్చి వెంట‌నే చిత్రాన్ని ఒప్పుకున్నాడు శర్వానంద్. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి విజ‌య‌ద‌శ‌మికి సినిమాను విడుద‌ల చేయటానికి స‌న్నాహ‌లు చేస్తున్నారు.

ద‌ర్శ‌కుడు మారుతి మాట్లాడుతూ.. భ‌లేభ‌లేమ‌గాడివోయ్ చిత్రం త‌రువాత నాకు బాగా న‌చ్చిన కేర‌క్ట‌రైజేష‌న్ తొ చేస్తున్న చిత్రం మ‌హ‌నుభావుడు. అన్ని ప‌క్కాగా అనుకున్న‌త‌రువాత ఈ చిత్రం సెట్ మీద‌కి వెళ్ళాం. శ‌ర్వానంద్ కెరీర్ లో ఈ చిత్రం బెస్ట్ చిత్రం గా నిలుస్తుంద‌ని నమ్మ‌కం వుంది. శ‌ర్వానంద్ చాలా బాగా చేశాడు. ఫుల్ కామెడి వుంటుంది. థ‌మ‌న్ సూప‌ర్ ఆడియో అందించాడు. మ్యూజిక‌ల్ ల‌వ్ స్టోరి గా ఈ చిత్రం వుంటుంది. అని అన్నారు.