మహానుభావుడు ముస్తాబయ్యాడు

Tuesday,September 19,2017 - 11:11 by Z_CLU

శర్వానంద్ కొత్త సినిమా మహానుభావుడు విడుదలకు సిద్ధమైంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించి ట్రయిలర్ విడుదలైంది. మారుతి సినిమాలంటేనే ఎంటర్ టైన్ మెంట్ కు కేరాఫ్ అడ్రస్. ఆ ఇమేజ్ కు ఏమాత్రం తీసిపోని విధంగా కట్ అయింది మహానుభావుడు ట్రయిలర్.

ఈ సినిమాలో హీరోకు వోసీడీ అనే బలహీనత ఉందనే విషయం ఇప్పటికే అందరికీ తెలుసు. టీజర్ లోనే ఆ విషయాన్ని చెప్పేశారు. ఇప్పుడా వీక్ నెస్ తో హీరో చేసే హంగామాను ట్రయిలర్ లో చూపించారు. అతిశుభ్రత అనే బలహీనత హీరోను ఎన్ని ముప్పుతిప్పలు పెట్టింది, అతడి ప్రేమకు ఎలా అడ్డంకిగా మారిందనేది ఈ సినిమా స్టోరీ.

సినిమా స్టోరీ సింపుల్. కాకపోతే దీన్ని మారుతి తనదైన స్టయిల్ లో ప్రజెంట్ చేసిన విధానం బాగుంది. తమన్ పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సింపుల్ అండ్ స్వీట్ గా ఉంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రమోద్, వంశీ నిర్మించిన ఈ సినిమాలో మెహరీన్ హీరోయిన్ గా నటించింది. దసరా కానుకగా థియేటర్లలోకి రానున్నాడు మహానుభావుడు.