శాతకర్ణి కోసం మహా రుద్రాభిషేకం

Wednesday,November 23,2016 - 12:30 by Z_CLU

శాతకర్ణీ విజయం కోసం మహా రుద్రాభిషేకం జరిపిస్తున్నారు అభిమానులు. బాలయ్య 100 వ సినిమా సెట్స్ పైకి వచ్చింది మొదలు ఏదోలా ఆయన శత సినిమా సంబరాలను జరుపుకుంటున్న అభిమానులు, ఈ సినిమా ఘన విజయం కోసం నవంబర్ 28 కార్తీక సోమవారం రోజున, NBK హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున దేశ వ్యాప్తంగా 1116 శివాలయాల్లో మహా రుద్రాభిషేకం నిర్వహిస్తున్నారు.

ఇక ఈ 1116 దేవాలయాల్లో బాలకృష్ణ ఏ దేవాలయంలో పాల్గొంటారో ఇప్పటికైతే తెలీదు కానీ, ఈ సినిమా సక్సెస్ కోసం సినిమా యూనిట్ తో పాటు అభిమానులు కూడా అంతే కష్టపడుతున్నారు. దేశంలో ఇప్పటి వరకు ఏ హీరో 100 వ సినిమాకు ఇంత ఘనంగా వేడుకలు జరగలేదు.