గౌతమీపుత్ర శాతకర్ణీ సీక్వెల్

Tuesday,January 10,2017 - 01:30 by Z_CLU

బాలయ్య గౌతమీపుత్ర శాతకర్ణీ జనవరి 12 న రిలీజ్ కానుంది. సినిమా సూపర్ హిట్ గ్యారంటీ అని ఓ వైపు ఫ్యాన్స్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉంటే, మరో వైపు ఈ సినిమా డైరెక్టర్ క్రిష్ ఈ సినిమా సీక్వెల్ గురించి ఆలోచించడం కూడా మొదలుపెట్టేశాడు.

గౌతమీపుత్ర శాతకర్ణీ సినిమాలో గౌతమీపుత్ర శాతకర్ణీ హైలెట్ అయితే, ఈ సినిమా సీక్వెల్ లో వశిష్టిపుత్రుడు పులుమావి కథ ఆధారంగా సీక్వెల్ ఉంటుందని చెప్పాడు క్రిష్.

ఏది ఏమైనా ఈ సినిమా ఎపుడు సెట్స్ పైకి తీసుకు వస్తాడో కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు కానీ, తన డ్రీం ప్రాజెక్ట్ గౌతమీపుత్ర శాతకర్ణీ రిలీజ్ అవుతున్న సందర్భంగా ఫుల్ జోష్ లో ఉన్నాడు క్రిష్ .