అదృష్టంగా ఫీలవుతున్న సునీత

Tuesday,January 17,2017 - 07:10 by Z_CLU

గౌతమీపుత్ర శాతకర్ణీ కేవలం బాలయ్యకే కాదు, పాప్యులర్ సింగర్ సునీతకి కూడా స్పెషల్ మూవీనే. గులాబి సినిమాలో ‘ఈ వేళలో నీవు’ పాటతో సింగర్ గా పరిచయం అయి, ఒక్కసారిగా గుర్తింపు సాధించుకున్న సునీత, జస్ట్ సింగర్ మాత్రమే కాదు, సక్సెస్ ఫుల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా.

గౌతమీపుత్ర శాతకర్ణీలో శ్రియకి డబ్బింగ్ చెప్పిన సునీతకి ఈ సినిమా 750 వ సినిమా. ఇప్పటి వరకు కొన్ని వేల పాటలను పాడి అలరించిన సునీతకి, బాలయ్య 100 వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణీలో డబ్బింగ్ చెప్పే అవకాశం రావడం, ఆ సినిమానే తన 750 వ చిత్రం కావడం, అందునా ఆ సినిమా ఈ రేంజ్ లో సక్సెస్ అవ్వడం నిజంగా అదృష్టంగా ఫీలవుతుంది సునీత.