సోషల్ మీడియాని శాసిస్తున్న శాతకర్ణి

Wednesday,January 18,2017 - 04:15 by Z_CLU

హిస్టారికల్ కంటెంట్ తో తెరకెక్కిన గౌతమీపుత్ర శాతకర్ణీ యూ ట్యూబ్ లోను హిస్టరీని క్రియేట్ చేస్తుంది. పవర్ ఫుల్ డైలాగ్స్ తో, ఇంటరెస్టింగ్ థీమ్ తో డిజైన్ అయిన గౌతమీపుత్ర శాతకర్ణీ ట్రేలర్, సినిమా రిలీజ్ అయిన తరవాత కూడా అదే స్పీడ్ తో వ్యూస్ ని రికార్డ్ చేస్తుంది.

ఇప్పటికే US లో మిలియన్ డాలర్లు వసూలు చేసిన గౌతమీపుత్ర శాతకర్ణీ, సోషల్ మీడియాలోనూ అదే క్రేజ్ ని బ్యాగ్ లో వేసుకుంటుంది. ఇప్పటికే 1,00,000 లైక్స్ దక్కించుకున్న గౌతమీపుత్ర శాతకర్ణీ ట్రేలర్, యూ ట్యూబ్ లోని ట్రెండింగ్ వీడియోస్ ని కూడా డామినేట్ చేస్తూ సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తుంది.

అసలే బాలయ్య 100 వ చిత్రం, అందునా తెలుగు జాతి గొప్పదనాన్ని దశదిశలా వ్యాపింపజేసిన గౌతమీ పుత్రుని కథ కావడం, క్రిష్ అవుట్ స్టాండింగ్ స్టోరి టెల్లింగ్ వ్యాల్యూస్ అన్ని వెరసి, GPS సోషల్ మీడియాలో కూడా సూపర్ హిట్ అనిపించుకుంటుంది.