శాతకర్ణిపై జక్కన్న కామెంట్స్

Thursday,January 12,2017 - 04:00 by Z_CLU

ఇండస్ట్రీకి ఓ మంచి సినిమా వచ్చిందంటే రియాక్ట్ అవ్వకుండా ఉండలేడు జక్కన్న. మనమంతా సినిమా రిలీజ్ అయిన వెంటనే ట్వీట్ చేశాడు. అంతా తప్పకుండా చూడాలని కోరాడు. నిన్నటికి నిన్న ఖైదీ నంబర్ 150 రిలీజ్ అయిన వెంటనే చిరంజీవిని అభినందించాడు. రామ్ చరణ్ కు కంగ్రాట్స్ చెప్పాడు. అయితే ఈ సినిమాలన్నింటినీ రాజమౌళి మెచ్చుకోవడం ఒక ఎత్తయితే.. శాతకర్ణి సినిమాపై ఈ స్టార్ డైరక్టర్ స్పందించిన విధానం మరో ఎత్తు.

rajamouli1-praises-gps

క్రిష్ దర్శకత్వంలో బాలయ్య వందో చిత్రంగా వచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా రాజమౌళిని మైమరిపించింది. ఎంతలా అంటే.. ఈ సినిమాపై ఓ రేంజ్ లో ప్రశంసల వర్షం కురిపిస్తూనే ఉన్నాడు జక్కన్న. ఈ సినిమా చూసి తను నేర్చుకోవాల్సింది చాలా ఉందని ప్రకటించిన రాజమౌళి… సినిమాకు సంబంధించి అందర్నీ పేరుపేరునా ప్రస్థావించాడు.

rajamouli2-praises-balakrishna

సాహో బసవతారకపుత్ర బాలకృష్ణ అంటూ తన ప్రశంసల్ని ప్రారంభించిన రాజమౌళి… క్రిష్ మేకింగ్ ను, 79 రోజుల్లో సినిమాను పూర్తిచేసిన తీరును మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. క్రిష్ నుంచి తను నేర్చుకోవాల్సింది చాలా ఉందని ట్వీట్ చేసిన జక్కన్న… మాటల రచయిత సాయిమాధవ్ బుుర్రాతో పాటు కెమెరామెన్, ప్రొడ్యూసర్ ను ప్రత్యేకంగా అభినందించాడు.