ప్రగ్యా జైస్వాల్ ఫస్ట్ లుక్ ఇదే...

Wednesday,November 23,2016 - 02:00 by Z_CLU

నాగార్జున హీరోగా నటిస్తున్న ‘ఓం నమో వెంకటేశాయ’ లో ప్రగ్యా జైస్వాల్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తుంది. నాగార్జున, అనుష్క లతో పాటు శ్రీకృష్ణుడిగా నటిస్తున్న సౌరభ్ జైన్ ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేసిన సినిమా యూనిట్ ఇప్పుడు ప్రగ్యా జైస్వాల్ ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేసింది.

ఎగ్జాక్ట్ గా ప్రగ్యా చేస్తున్న క్యారెక్టర్స్ డీటేల్స్ అయితే తెలియదు కానీ ఆమె ఫస్ట్ లుక్ మాత్రం ఇలా రిలీజయిందో లేదో అటు సోషల్ నెట్ వర్క్ లో వైరల్ అయింది.  కంచె సినిమాతో తెలుగుతెరకు పరిచయం అయిన ప్రగ్యా, తన రెండో సినిమాకే దర్శకేంద్రుడి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా గాని హిట్టయితే ప్రగ్యా, స్టార్ హీరోయిన్ రేసుకి క్వాలిఫై అయినట్టే.