డిజప్పాయింట్ అయిన లావణ్య త్రిపాఠి

Friday,April 26,2019 - 12:03 by Z_CLU

మళ్ళీ డిజప్పాయింట్ అయింది లావణ్య త్రిపాఠి. ‘అర్జున్ సురవరం’ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్న వారిలో లావణ్యదే ఫస్ట్ ప్లేస్. ప్రస్తుతానికి ఒక్క సినిమా కూడా చేతిలో లేని లావణ్య ఈ సినిమా సక్సెస్ పై బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే లేటయింది అనే ఫీల్ ఉన్నా, ఎట్టకేలకు రిలీజ్ అవుతుందని ఆనందించే లోపు, మళ్ళీ పోస్ట్ పోన్ అవ్వడం లావణ్యకు బాధ కలిగించింది.

లాస్ట్ ఇయర్ 2 సినిమాలు చేసింది లావణ్య. వీటిలో ఇంటిలిజెంట్ సినిమా డిజాస్టర్ గా నిలవగా.. అంతరిక్షం సినిమాలో లావణ్య పాత్ర ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంది.

ఇప్పుడు ‘అర్జున్ సురవరం’ తో గట్టిగా ట్రై చేద్దాం అనుకునే లోపు, ఈ సినిమా కూడా అస్తమానం రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుండటంతో, ఏం చేయాలో తెలీని స్థితిలో ఉండిపోయింది లావణ్య. అయితే ఇక్కడ లావణ్య ఫీలవ్వాల్సిన పాజిటివ్ పాయింట్  ఒకటుంది…

‘అర్జున్ సురవరం’ రిలీజ్ ఆగిపోయిందంటే అది సినిమా సక్సెస్ ని మైండ్ లో పెట్టుకుని డిస్ట్రిబ్యూటర్స్ తీసుకున్న నిర్ణయం. అందుకే ఓ రకంగా ఇది మరీ అంతగా బాధపడాల్సిన విషయం కానే కాదు.. కాస్త లేట్ గా వచ్చినా గట్టిగా కొట్టాల్సిందే అన్న కసి టీమ్ లో ఉంది కాబట్టి… లావణ్య కూడా అలాగే ఫీలయితే సరిపోతుంది.