మరోసారి వాయిదాపడిన నిఖిల్ సినిమా

Thursday,April 25,2019 - 02:56 by Z_CLU

ఏ ముహూర్తాన ఈ సినిమా స్టార్ట్ చేశారో కానీ అప్పట్నుంచి వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. ఈసారి గ్యారెంటీగా రిలీజ్ అవుతుందని భావించారు కానీ, ఊహించని విధంగా మరోసారి పోస్ట్ పోన్ అయింది అర్జున్ సురవరం. అవును.. నిఖిల్ హీరోగా నటించిన ఈ సినిమాను మరోసారి వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

మూవీ పోస్ట్ పోన్ పై నిఖిల్ కూడా రియాక్ట్ అయ్యాడు. బాధగా ఉన్నప్పటికీ, డబ్బులు పెట్టి కొన్ని డిస్ట్రిబ్యూటర్ల మాటను కూడా గౌరవించాలని కోరాడు. వెయిట్ చేయిస్తున్నందుకు ప్రేక్షకులకు క్షమాపణలు కూడా చెప్పాడు.

నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన ఈ సినిమా తమిళ్ లో హిట్టయిన కనిథన్ సినిమాకు రీమేక్. టీఎన్ సంతోష్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు.