‘మన్మధుడు 2’ లో గమనించాల్సిన అంశాలు

Friday,April 26,2019 - 01:03 by Z_CLU

17 ఏళ్ల తరవాత మళ్ళీ అదే టైటిల్ తో ‘మన్మధుడు 2’ సినిమా చేస్తున్నాడు నాగార్జున. టైటిల్ ని బట్టి ఈ సినిమా కూడా మన్మధుడు స్టాండర్డ్స్ తో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ అని తెలుస్తున్నా, ఆ సినిమాకి ఈ సినిమాకి మధ్య ఫౌండేషన్ స్థాయిలోనే చాలా మార్పులున్నాయి. అవేంటంటే…

మన్మధుడు : విజయ్ భాస్కర్ సినిమా అంటేనే నాన్ స్టాప్ ‘ఎంటర్టైన్ మెంట్’ అనే బ్రాండ్ క్రియేట్ అయి ఉండేది అప్పట్లో. సొంత క్యారెక్టర్ పైనే పంచులుంటాయి అని తెలిసినా, స్టార్ హీరోస్ ఆయన డైరెక్షన్ లో చేయడానికి ఇష్టపడేవారు. దానికి తోడు త్రివిక్రమ్ స్టోరీ, డైలాగ్స్ రాశాడు. కానీ ‘మన్మధుడు 2’ వరకు వచ్చేసరికి రాహుల్ రవీంద్రన్ అంతా తానై చూసుకున్నాడు. మొదటి సినిమా చి.ల.సౌ. తో సెన్సిబుల్ డైరెక్టర్ అనిపించుకున్న ఈ యంగ్ డైరెక్టర్, ఈ ‘మన్మధుడు’ ని డిఫెరెంట్ గా ప్రెజెంట్ చేయబోతున్నాడు.

హీరోయిన్: ‘మన్మధుడు’ లో ఇద్దరేసి హీరోయిన్స్. సోనాలి బింద్రే, అంశు… ఇద్దరూ ఇద్దరే అనిపించుకున్నారు. ఇక ఈ మన్మధుడి సరసన హీరోయిన్ ఒక్కరే. రకుల్ ప్రీత్… ఇది కూడా గమనించాల్సిన తేడా.

 

మ్యూజిక్ డైరెక్టర్ : అప్పట్లో మన్మధుడు ఆడియో బ్లాక్ బస్టర్. DSP కంపోజ్ చేశాడు మ్యూజిక్. ఇప్పుడు ‘RX 100’ లాంటి సెన్సేషనల్ సినిమాతో ఫోకస్ లోకి వచ్చిన చింతన్ భరద్వాజ్ ఈ సినిమాకి మ్యూజిక్ ఇస్తున్నాడు. DSP మార్క్ కి చింతన్ భరద్వాజ్ మార్క్ కి చాలా డిఫెరెన్స్ ఉంటుంది మరి.

స్టోరీలైన్ : డెఫ్ఫినెట్ గా మారుతుంది. అసలు ‘మన్మధుడు’ కి ఈ సినిమాకి కనెక్షన్ ఉండదు. రాహుల్ రవీంద్రన్ కథ కాబట్టి, నాగార్జున దగ్గరి నుండి ప్రతి క్యారెక్టర్ ప్రెజెంటేషన్ డిఫెరెంట్ గా ఉండబోతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ సినిమా ఖచ్చితంగా కొత్త    అనుభూతిని ఇవ్వనుంది.

న్యూ ఏజ్ ఎలిమెంట్స్ : అప్పటి ‘మన్మధుడు’ ఆ జెనెరేషన్ కి ఈజీగా నచ్చేసింది. అందుకే టైటిల్ తీసేసుకున్నా… సినిమాలోని మిగతా ఎలిమెంట్స్ విషయంలో మాత్రం పక్కా న్యూ ఏజ్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి. ఇలా ‘మన్మధుడు’, ‘మన్మధుడు 2’ కి మధ్య చాలా డిఫెరెన్సెస్ ఉండబోతున్నాయి.