మహర్షి – ఫస్ట్ టైమ్ అనుభవాలు

Friday,April 26,2019 - 11:03 by Z_CLU

ఫోకస్ అంతా ‘మహర్షి’ పై ఉంది. మహేష్ కరియర్ లోనే ఇది స్పెషల్ సినిమాగా నిలిచిపోతుందంటున్నారు మేకర్స్. ఇప్పటివరకు ఫ్యాన్స్ మహేష్ నటించిన 24 సినిమాలు చూసేసి ఉన్నా, ఈ సినిమాలో మరింత కొత్తదనం చూడబోతున్నాం అనడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి.  ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ కొన్ని కాంబినేషన్స్ కుదిరాయి.

వంశీ పైడిపల్లి : వంశీ పైడిపల్లి సినిమాలంటే ఓ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అని పేరు ఉంది. అయినా ఇప్పటివరకు వంశీ పైడిపల్లికి మహేష్ బాబుతో సినిమా చేసే చాన్స్ దొరకలేదు, ఫస్ట్ టైమ్ వీళ్ళిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు.

విలేజ్ బ్యాక్ డ్రాప్ : ఇది మరీ మహేష్ బాబుకి కొత్త కాదు కానీ, బయటికి వస్తున్న టాక్ ని బట్టి వ్యవసాయ రంగంలో ఒక రివొల్యూషన్ క్రియేట్ చేసే స్థాయి పాత్రలో కనిపించబోతున్నాడు మహేష్ బాబు. వ్యవసాయం, రైతులు సమస్యల్ని సీరియస్ గా చూపించడం ఈ సినిమా ప్రత్యేకత.

పూజా హెగ్డే : ఫస్ట్ టైమ్ మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా నటించిన సినిమా ఇది. వీళ్ళిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలున్నాయి. జస్ట్ సాంగ్స్.. రొమాంటిక్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా సినిమాలో వీళ్ళిద్దరి మధ్య ఓ స్ట్రాంగ్ బాండింగ్ ఎలివేట్ అయ్యే స్థాయిలో ఎమోషనల్ సీన్స్ ఉన్నాయని తెలుస్తోంది.

ఫ్రెండ్ షిప్ బేస్డ్ ఎలిమెంట్స్ : సినిమాలో మహేష్ ఉంటే పక్కన ఫ్రెండ్స్ కామన్. కానీ ఫ్రెండ్ షిప్ బ్యాక్ డ్రాప్ తో మహేష్ సినిమా చేయలేదు. మహర్షి సినిమా ఆ లోటు తీరుస్తుంది. పైగా ఇందులో మహేష్ కు ప్రాణస్నేహితుడిగా మరో హీరో అల్లరినరేష్ నటించాడు.

ఒక్క సినిమా – 3 గెటప్స్ : స్టూడెంట్, బిజినెస్ మేన్, రైతు.. ఇలా ఒకే సినిమాలో 3 డిఫెరెంట్ గెటప్స్ లో కనిపించనున్నాడు  మహేష్ బాబు. కరియర్ లోనే ఇది ఫస్ట్ టైమ్. ఇప్పటికే ఈ 3 గెటప్స్ ఎలా ఉండబోతున్నాయనేది రివీల్ అయింది. ఇక తెలియాల్సింది ఈ 3 గెటప్స్ తో ‘మహర్షి’ జర్నీ ఎలా ఉండబోతుందనేదే.