రిలీజ్ డేట్..? మ్యాటర్స్...

Tuesday,May 21,2019 - 12:03 by Z_CLU

సినిమా తీయడం ఒకెత్తు. సరైన టైమ్ కు దాాన్ని రిలీజ్ చేయడం మరో ఎత్తు. ఈ విషయంలో కొన్ని సినిమాలు ఇబ్బంది పడుతున్నాయి.

అర్జున్ సురవరం – ఇప్పటికే 2 సార్లు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి మరీ సినిమా రిలీజ్ చేయకుండా ఆపేశారు మేకర్స్. రీసెంట్ గా మే 1 కైనా సినిమా థియేటర్స్ లోకి వస్తుందనుకున్నారంతా. కానీ అవెంజర్స్ ఎఫెక్ట్ కి, రిలీజ్ డేట్ వెనక్కి తీసుకున్నారు మేకర్స్… ఇప్పటివరకు మళ్ళీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు.

సైరా – జస్ట్ చిన్న సినిమాల విషయంలోనే కాదు.. ‘సైరా’ విషయంలో కూడా అంతే. రేపో మాపో లాస్ట్ షెడ్యూల్ కి ప్యాకప్ చెప్పేయనున్నారు మేకర్స్. సంక్రాతికి రిలీజ్ అని తెలుస్తున్నా, రిలీజ్ డేట్ విషయంలో మాత్రం ఇంకా ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. అక్టోబర్ 2న విడుదల చేయబోతున్నారనేది టాక్ మాత్రమే. ఇంకా అఫీషియల్ కాదు.

కల్కి – సినిమా ప్రమోషన్స్ కూడా బిగిన్ అయిపోయాయి. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కానీ రిలీజ్ డేట్ విషయంలోనే ఎటూ తేల్చుకోలేకపోతున్నారు మేకర్స్.