వీకెండ్ రిలీజ్

Wednesday,November 27,2019 - 12:29 by Z_CLU

గతవారం ఏకంగా 7 సినిమాలు పోటీ పడ్డా ఈ వారం రిలీజవుతున్న సినిమాలకు కంప్లీట్ గా రూట్ క్లియర్ గా ఉందనిపిస్తుంది. విడుదలయ్యేది జస్ట్ 3 సినిమాలే. అందునా దేనికది డిఫెరెంట్ జోనర్స్ లోనే…

అర్జున్ సురవరం : సరిగ్గా రిలీజ్ సమయానికి ఏదో ఒక అడ్డంకి ఎదురై… సినిమాని ఇప్పటి వరకు పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చిన మేకర్స్… ఎట్టకేలకు పోటీలేని వీకెండ్ కి ఫిక్సయ్యారు. తమిళ బ్లాక్ బస్టర్ ‘కనిథన్’ కి రీమేక్ గా తెరకెక్కిన  ఈ సినిమాలో నిఖిల్ జర్నలిస్ట్ గా నటించాడు. ఓ క్రైమ్ ని మీడియా ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నంలో తనే దోషిగా ఇరుక్కున్న హీరో ఆ సమస్య నుండి ఎలా బయటపడ్డాడన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

 

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు : రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ఇది. ఫ్యాక్షనిజం, పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కి ముందే సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ వైబ్స్ క్రియేట్ చేసింది. ఇక బాక్సాఫీస్ దగ్గర నిలబడుతుందా లేదా..? అనేది ఈ వీకెండ్ తేలిపోతుంది.

రాజావారు రాణిగారు : కిరణ్ అబ్బావరం, రహస్య గోరక్ జంటగా నటించిన ఫీల్ గుడ్ లవ్ ఎంటర్ టైనర్. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ యూత్ ని బాగానే ఎట్రాక్ట్ చేసింది. బాక్సాఫీస్ దగ్గర నిలబడుతుందా లేదా చూడాలి.