అక్కడా వాళ్ళే.. ఇక్కడా వాళ్ళే...

Thursday,November 21,2019 - 09:03 by Z_CLU

సాధారణంగా ఓ సినిమా రిమేక్ అయిందంటే మ్యాగ్జిమం డైరెక్టర్ మారే అవకాశాలుంటాయి. నేటివిటీ రేంజ్ రీచ్ అవ్వడానికో.. ఇతరత్రా కారణాల వల్లనో… డైరెక్టర్స్ మారతారు. కానీ ఈ సినిమాలకు మాత్రం అక్కడా వాళ్ళే దర్శకులు.. ఇక్కడా వాళ్ళే దర్శకులు…

96  తమిళంలో త్రిష, విజయ్ సేతుపతి జంటగా నటించిన సినిమా.  ప్రేమ్ కుమార్ ఈ సినిమాకి దర్శకుడు. రెగ్యులర్ కమర్షియల్ హంగులు లేకపోయినా, న్యాచురల్ గా సాగే ఎమోషనల్ ఎలిమెంట్స్ తో సినిమాని తెరకెక్కించి గ్రాండ్ సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడీ సినిమా తెలుగులో శర్వా, సమంతా జంటగా తెరకెక్కుతుంది. ఇక్కడ కూడా ప్రేమ్ కుమార్ దర్శకుడు.

అర్జున్ సురవరం తమిళంలో ‘కనిథన్’ అనే టైటిల్ తో తెరకెక్కింది. T.N. సంతోష్ ఈ సినిమాకి దర్శకుడు. ఈ సినిమాకి రీమేకే ఇప్పుడు రిలీజ్ కి రెడీగా ఉన్న ‘అర్జున్ సురవరం’. భాష మారినా దర్శకుడు మారలేదు.

అర్జున్ రెడ్డి తెలుగులో సెన్సేషనల్ హిట్. ఈ సినిమా బాలీవుడ్ లో కూడా అదే స్థాయి సక్సెస్ ని అందుకుంది. అయితే తెలుగులో ఈ సినిమాని తెరకెక్కించిన సందీప్ రెడ్డి వంగ… హిందీలో కూడా తనే దర్శకత్వం వహించాడు.

జెర్సీ ఈ సినిమా హిందీలో రీమేక్ అనగానే లీడ్ రోల్స్ తో పాటు డైరెక్టర్ కూడా మారతాడు అనుకున్నారంతా. కానీ అంచనాలకు భిన్నంగా గౌతమ్ తిన్ననూరి ఈ రీమేక్ తో బాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ అవుతున్నాడు.