సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘కుశ’ టీజర్

Friday,September 08,2017 - 03:38 by Z_CLU

సెప్టెంబర్ 21 న రిలీజ్ కి రెడీ అవుతుంది NTR జై లవకుశ. రీసెంట్ గా రిలీజైన ఆడియో అటు యూత్ తో పాటు మాస్ ఆడియెన్స్ ని కూడా ఇంప్రెస్ చేసేస్తుంది. అయితే వరసగా జై , లవకుమార్ ల క్యారెక్టర్స్ తరవాత కుశ క్యారెక్టర్ ని  ఇంట్రడ్యూస్ చేస్తూ రిలీజ్ చేసిన టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ, అప్పుడే 1 మిలియన్ డిజిటల్ వ్యూస్ క్రాస్ చేసేసింది.  

NTR కరియర్ లోనే ఫస్ట్ టైమ్ 3 డిఫెరెంట్ క్యారెక్టర్స్ లలో కనిపించనున్నాడు. జైక్యారెక్టర్ రావణుడి రేంజ్ విలనిజాన్ని ఎలివేట్ చేస్తే, రీసెంట్ గా రిలీజైన లవ కుమార్ క్యారెక్టర్ సాఫ్ట్ అండ్ జెన్యూన్ గా ఉండబోతుందని టీజర్ చూస్తే అర్థమైపోయింది. ఇక కుశ టీజర్ ని చూస్తే, సినిమాలో మోస్ట్ ఎంటర్ టైనింగ్, మాస్ క్యారెక్టర్ అని తెలుస్తుంది.

బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని NTR ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాలో నివేద థామస్, రాశిఖన్నా హీరోయిన్స్ గా నటించారు.