రేపే కుశ క్యారెక్టర్ టీజర్ రిలీజ్

Thursday,September 07,2017 - 01:32 by Z_CLU

సెప్టెంబర్ 21 న రిలీజ్ కి రెడీ అవుతుంది NTR జై లవకుశ. రీసెంట్ గా రిలీజైన ఆడియో అటు యూత్ తో పాటు మాస్ ఆడియెన్స్ ని కూడా ఇంప్రెస్ చేసేస్తుంది. అయితే ఆడియో కన్నా ముందు జై , లవకుమార్ ల క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ రిలీజైన టీజర్స్, సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ఇప్పుడు అదే వరసలో కుశ టీజర్ ని రేపు 10 గంటలకు సోషల్ మీడియాలో రిలీజ్ చేయనుంది సినిమా యూనిట్.

NTR కరియర్ లోనే ఫస్ట్ టైమ్ 3 డిఫెరెంట్ క్యారెక్టర్స్ లలో కనిపించనున్నాడు. ‘జై’ క్యారెక్టర్ రావణుడి రేంజ్ విలనిజాన్ని ఎలివేట్ చేస్తే, రీసెంట్ గా రిలీజైన లవ కుమార్ క్యారెక్టర్ సాఫ్ట్ అండ్ జెన్యూన్ గా ఉండబోతుందని టీజర్ చూస్తే అర్థమైపోతుంది. ఇకపోతే రేపు మార్నింగ్ ‘కుశ’ క్యారెక్టర్ ని ఇంటరెస్టింగ్ టీజర్ తో ఇంట్రడ్యూస్ చేయనుంది సినిమా యూనిట్.

బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని NTR ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాలో నివేద థామస్, రాశిఖన్నా హీరోయిన్స్ గా నటించారు.