‘లవ’ టీజర్ రిలీజయింది

Thursday,August 24,2017 - 05:55 by Z_CLU

NTR లవ టీజర్ రిలీజయింది. జై లవకుశ సినిమాలో రీసెంట్ గా జై టీజర్ ని రిలీజ్ చేసి NTR లోని మరో యాంగిల్ ని   ఎలివేట్ చేసిన JLK టీమ్, ఇప్పుడు ‘లవ’ టీజర్ తో NTR లోని ఇన్నోసెంట్ ఆంగిల్ పర్ఫామెన్స్ ని ప్రెజెంట్ చేసింది. ‘జై’ నెగెటివ్ క్యారెక్టర్ అయితే బ్యాంక్  మ్యానేజర్  గా  పనిచేసే ‘లవ కుమార్’ మంచితనానికి బ్రాండ్ అంబాసిడర్ లా తెలుస్తుంది.

‘మంచితనం పుస్తకాల్లో ఉంటే పాఠం అవుతుంది, మనలో ఉంటే గుణపాఠం అవుతుంది’ అంటూ NTR చెప్పే డైలాగ్, దానికి తోడు ఒక షాట్ లో NTR ఆక్సిడెంట్ కి గురవ్వడం లాంటివి గమనిస్తే, లవకుమార్ మంచితనం, ప్రాబ్లమటిక్ గా ఏ సందర్భంలో మారుతుంది..? ఆ తరవాత ఏం జరుగుతుంది అనే క్యూరాసిటీ రేజ్ అవుతుంది.

 

బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని  కళ్యాణ్ రామ్ NTR ఆర్ట్స్దే బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. దేవి  శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. రాశి ఖన్నా, నివేద థామస్ ఈ సినిమాలో హీరోయిన్స్.