మరికొన్ని గంటల్లో జై లవకుశ ట్రయిలర్

Sunday,September 10,2017 - 10:30 by Z_CLU

సెప్టెంబర్ 21 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతున్న జై లవకుశ టాలీవుడ్ లో హై ఎండ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతుంది. ఈరోజు జరగనున్న ఈవెంట్ లో రిలీజ్ కానున్న ట్రేలర్ కోసం మునుపెన్నడూ లేని విధంగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటివరకు రిలీజైన జై, లవ, కుశ టీజర్స్ సినిమాపై ఇంట్రెస్ట్ ని జెనెరేట్ చేస్తూనే ఈ మూడు క్యారెక్టర్స్ కి మధ్య ఉన్న కనెక్షన్ ఏమై ఉంటుందా అనే క్యూరాసిటీ జెనెరేట్ చేసింది. ఆ సస్పెన్స్ ఈరోజు రిలీజ్ కానున్న ట్రేలర్ తో రివీల్ కానుంది.

బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఇమోషనల్ ఎంటర్ టైనర్ సెట్స్ పైకి వచ్చినప్పటి నుండే పాజిటివ్ బజ్ ని బ్యాగ్ లో వేసుకుంటుంది. దానికి తోడు సినిమా యూనిట్ పక్కాగా ప్లాన్ చేసుకున్న ప్రమోషన్ ప్రాసెస్, మూవీ లవర్స్ కి స్ట్రేట్ గా రీచ్ అవుతుంది.

బాబీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాని కళ్యాణ్ రామ్ NTR ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్. రాశి ఖన్నా, నివేత థామస్ హీరోయిన్స్ గా నటించారు.