కోటి వ్యూస్ కొల్లగొట్టిన జై లవకుశ

Wednesday,July 12,2017 - 10:32 by Z_CLU

ఎన్టీఆర్ నటిస్తున్న జై లవకుశ సినిమా కోటి వ్యూస్ కొల్లగొట్టింది. అది కూడా కేవలం యూట్యూబ్ లోనే కావడం విశేషం. ఇలా అతి తక్కువ టైమ్ లో యూట్యూబ్ లో కోటి వ్యూస్ రాబట్టిన సినిమాగా బాహుబలి-2 తర్వాత జై లవకుశ నిలిచింది. విడుదలైన 48 గంటల్లోనే ఈ సినిమా యూట్యూబ్, ఫేస్ బుక్ లో కలుపుకొని కోటి వ్యూస్ దక్కించుకుంది. ఇప్పుడు ఒక్క యూట్యూబ్ లోనే ఈ టీజర్ కు కోటి వ్యూస్ వచ్చాయి.

జై లవకుశ సినిమాలో ఎన్టీఆర్ 3 డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నాడు. వీటిలో జై అనే పాత్ర నెగెటివ్ ఛాయల్లో కనిపిస్తుంది. ఆ పాత్రకు సంబంధించిన టీజర్ నే మొదట విడుదల చేసి చిన్నపాటి షాకిచ్చారు. ఎవరూ ఊహించని విధంగా టీజర్ ఉండడంతో సూపర్ గా క్లిక్ అయింది. అందుకే ఇన్ని వ్యూస్ వచ్చాయి.

బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దసరా బరిలో దించబోతున్నారు. సెప్టెంబర్ 21న ఈ సినిమాను రిలీజ్ చేస్తారు. రాశి ఖన్నా, నివేత థామస్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.