నాగచైతన్య సవ్యసాచిలో ఇంటరెస్టింగ్ పాయింట్

Friday,September 08,2017 - 04:40 by Z_CLU

నాగచైతన్య ‘యుద్ధం శరణం’ ఈ రోజే గ్రాండ్ గా రిలీజయింది. యూత్ ని టార్గెట్ చేస్తూ ఇంటలిజెన్స్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో ఇంప్రెస్ చేసేస్తుంది. అయితే నాగచైతన్య ఈ సినిమా తరవాత ఇమ్మీడియట్ గా చందూ మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కనున్న సవ్యసాచి సినిమాతో బిజీ కానున్నాడు. అయితే ఈ సినిమాలో నాగచైతన్య లెఫ్ట్ హ్యాండ్ తన కంట్రోల్ లో ఉండదట. తనంతట తానే రియాక్ట్ అయ్యే లెఫ్ట్ హ్యాండ్, ఇంకో క్యారెక్టర్ లా పనిచేయడం ఈ సినిమాలో మోస్ట్ ఇంటరెస్టింగ్ పాయింట్ కానుంది.

అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కనుంది. ప్రస్తుతం ఫాస్ట్ పేజ్ లో ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న సినిమా యూనిట్, అక్కినేని నాగేశ్వర రావు గారి బర్త్ డే సందర్భంగా సెప్టెంబర్ 20 నుండి సినిమాని సెట్స్ పైకి తీసుకు వచ్చే ప్రాసెస్ లో ఉన్నారు.