సాహో లో శ్రద్ధాకపూర్ ని ఫిక్సవ్వడానికి మెయిన్ రీజన్

Friday,September 08,2017 - 12:15 by Z_CLU

ప్రభాస్ సాహో సినిమాలో శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా ఫిక్సయ్యిందనే న్యూస్ తెలిసిందే. అయితే ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్సెస్ లో పర్ఫామ్ చేయబోతుందట. శ్రద్ధా ఈ సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ లో నటించబోతుందనేది ప్రస్తుతానికి రివీల్ కాకపోయినా, సినిమాలో శ్రద్దా గ్లామరస్ గానే కాదు, యాక్షన్ తో కూడా ఇంప్రెస్ చేయబోతుందని తెలుస్తుంది.

గతంలో ‘బాఘి’ సినిమాలో శ్రద్ధాకపూర్ స్టంట్స్ చేసిన అనుభవం ఉండటంతో, ఈ సినిమాకి తనే పర్ ఫెక్ట్ అని ఫీలై అయిన ఫిలిం మేకర్స్ శ్రద్ధాని ప్రభాస్ సరసన ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఈ రోజే ఈ సినిమా కోసం హైదరాబాద్ కి వచ్చిన శ్రద్ధా, ఇవాళ్టి నుండే సాహో సినిమా రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొననుంది.

సాహో కోసం తెలుగు నేర్చుకుంటున్న శ్రద్ధా, స్టంట్ విషయంలోనూ అంతే సీరియస్ గా ట్రేనింగ్ తీసుకుంటుందట. సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న 2018 లో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు  ఫిలిమ్ మేకర్స్.