రిపబ్లిక్ డే కానుకగా క్రిష్ 'మణికర్ణిక'

Wednesday,August 15,2018 - 11:11 by Z_CLU

కంగనా రనౌత్  రాణి లక్ష్మీబాయి గా కనిపించనున్న ‘మణికర్ణిక’ రిలీజ్ డేట్ ఫిక్సయింది. ఇండిపెండెన్స్ డే సందర్బంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్  తో పాటు రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసిన ఫిల్మ్ మేకర్స్, ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. జనవరి 25 న ఈ  సినిమా రిలీజ్ అవుతుంది.

తెలుగు, తమిళ హిందీ భాషల్లో రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమాలో సోనుసూద్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాలో ఝాన్సీ రాణి లక్ష్మీ బాయ్ లైఫ్ లోని హిస్టారికల్ ఎలిమెంట్స్ ని సిల్వర్ స్క్రీన్ పై ఎలివేట్ చేయనున్నారు ఫిల్మ్  మేకర్స్. ఈ సినిమాకి శంకర్ – ఎహసాన్ – లాయ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమా దర్శకుడు క్రిష్, ప్రస్తుతం బాలయ్యతో NTR  బయోపిక్ తెరకెక్కించే ప్రాసెస్ లో ఉన్నాడు. ఈ సినిమా సంక్రాంతి రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ లెక్కన 2019  జనవరి లో ఇటు క్రిష్ మణికర్ణిక తో పాటు NTR,   2  సినిమాలు ఒకే నెలలో  రిలీజ్ కానుండటం విశేషం.