జీ సినిమాలు (మార్చ్ 9th)

Monday,March 08,2021 - 10:15 by Z_CLU

సైజ్ జీరో

నటీనటులు : అనుష్క శెట్టి, ఆర్య
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, ఊర్వశి, సోనాల్ చౌహాన్, అడివి శేష్, బ్రహ్మానందం, గొల్లపూడి మారుతి రావు, తనికెళ్ళ భరణి మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : M.M. కీరవాణి
డైరెక్టర్ : ప్రకాష్ కోవెలమూడి
ప్రొడ్యూసర్ : ప్రసాద్ వి. పొట్లూరి
రిలీజ్ డేట్ : 27 నవంబర్ 2015

అధిక బరువు ఉన్నప్పటికీ ఏ మాత్రం కాన్ఫిడెన్స్ తగ్గని సౌందర్య అభిషేక్ తో ప్రేమలో పడుతుంది. తన ప్రేమని పొందటం కోసం, అతి తక్కువ కాలంలో బరువు తగ్గించే క్లినిక్ లో కూడా జాయిన్ అవుతుంది. సౌందర్య అక్కడేం తెలుసుకుంటుంది..? చివరికి సౌందర్య బరువు తగ్గుతుందా..? అభిషేక్ ప్రేమను తను పొందగలుగుతుందా..? అనేదే ఈ సినిమా కథ. అనుష్క పర్ఫామెన్స్ సినిమాకి హైలెట్ గా నిలుస్తుంది.

_____________________________________________

లక్ష్మి

తారాగణం : ప్రభుదేవా , ఐశ్వర్య రాజేష్, కోవై సరళ, దిత్య బండే , సల్మాన్ యూసుఫ్ ఖాన్, చామ్స్ , అక్షత్ సింగ్, జీత్ దాస్, సామ్ పాల్.
రచన మరియు దర్శకత్వం: ఎఎల్ విజయ్
నిర్మాతలు: సి. కల్యాణ్, ప్రతీక్ చక్రవర్తి, శృతి నల్లప్ప మరియు ఆర్.రవీంద్రన్
బ్యానర్లు: సి.కె ఎంటర్టైన్మెంట్స్, ప్రమోద్ ఫిల్మ్స్ మరియు ట్రైడెంట్ ఆర్ట్స్
సంగీతం: సామ్ సీఎస్
డీఓపీ : నీరవ్ షా
ఎడిటర్ : ఆంథోనీ

ప్రభుదేవా, ఐశ్వర్య ప్రధానపాత్రల్లో నటిస్తున్న సినిమా ‘లక్ష్మి’.. ఏ.ఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా కిడ్స్ డాన్స్ రియాలిటీ షో సూపర్ డాన్సర్ సీజన్ 1 విజేత అయిన దిత్య బండే బాలనటిగా పరిచయమైంది. డాన్స్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో దిత్య డాన్స్ గురువుగా ప్రభుదేవా కనిపించాడు. దిత్య స్టెప్పులు, కథలో ఎమోషన్స్ ఈ సినిమాలో మెయిన్ ఎట్రాక్షన్స్.

_______________________________________________

శతమానంభవతి

నటీనటులు : శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, జయసుధ, నరేష్, ఇంద్రజ, రాజా రవీంద్ర, హిమజ, ప్రవీణ్ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : మిక్కీ. జే. మేయర్
డైరెక్టర్ : సతీష్ వేగేశ్న
ప్రొడ్యూసర్ : దిల్ రాజు
రిలీజ్ డేట్ : 14 జనవరి 2017

ఆత్రేయ పురం అనే గ్రామంలో రాఘవ రాజు(ప్రకాష్ రాజ్) జానకమ్మ(జయసుధ) అనే దంపతులు తమ పిల్లలు విదేశాల్లో స్థిరపడి తమను చూడడానికి రాకపోవడంతో కలత చెంది తన మనవడు రాజు (శర్వానంద్) తో కలిసి సొంత ఊరిలోనే జీవిస్తుంటారు. ఈ క్రమంలో పిల్లల్ని ఎలాగైనా సంక్రాంతికి తమ ఊరికి రప్పించాలని రాజు గారిని కోరుతుంది జానకమ్మ. తన భార్య కోరిక మేరకూ ఎప్పుడు కబురుపెట్టినా రాని పిల్లల కోసం ఒక పథకం వేసి సంక్రాంతికి ఊరు రప్పిస్తాడు రాఘవ రాజు. ఇంతకీ రాజు గారు వేసిన ఆ పథకం ఏమిటి? రాజు గారి కబురు మేరకు స్వదేశం తిరిగొచ్చిన పిల్లలు తాము దూరంగా ఉండడం వల్ల తల్లిదండ్రుల పడుతున్న భాధ ఎలా తెలుసుకున్నారు? అనేది ఈ సినిమా కథాంశం.

___________________________________________

manikarnika-zee-cinemalu-569x320-569x320

మణికర్ణిక

నటీనటులు : కంగనా రనౌత్, మొహమ్మద్ జీషన్ అయ్యుబ్

ఇతర నటీనటులు : అతుల్ కులకర్ణి, జీషు సేన్ గుప్తా, రిచర్డ్ కీప్, సురేష్ ఒబెరాయ్, డానీ డెన్ జోంగ్ పా, అంకిత లోఖాండే తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శంకర్ – ఎహసాన్- లాయ్

డైరెక్టర్ : క్రిష్

ప్రొడ్యూసర్ : జీ స్టూడియోస్, కమాల్ జైన్, నిశాంత్ పిట్టి

రిలీజ్ డేట్ : 25 జనవరి 2019

మహారాణి ఝాన్సీ లక్ష్మీబాయ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా మణికర్ణిక. ఝాన్సీ రాజ్యాన్ని బ్రిటీషు వారి బారిన పడకుండా లక్ష్మీ బాయ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది..? తన ప్రజలను కలుపుకుని వారిపై ఎలా తిరగబడింది అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం. యుద్ధ సన్నివేశాలు సినిమాలో హైలెట్ గా నిలిచాయి.

________________________________________

Bommarillu-zee-cinemalu1-551x3201

బొమ్మరిల్లు

నటీనటులు : సిద్ధార్థ్జెనీలియా

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్కోట శ్రీనివాస రావుజయసుధసత్య కృష్ణన్సుదీప పింకీసురేఖా వాణి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్

డైరెక్టర్ : భాస్కర్

ప్రొడ్యూసర్ : దిల్ రాజు

రిలీజ్ డేట్ : 9 ఆగష్టు 2006

తండ్రి కొడుకుల అనుబంధాన్ని అద్భుతంగా తెరకెక్కించిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ బొమ్మరిల్లు. న్యాచురల్ పర్ఫామెన్స్ అలరించిన జెనీలియాసిద్ధార్థ్ పర్ఫామెన్స్ సినిమాకే హైలెట్. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకే హైలెట్.

_____________________________________________

దంగల్

నటీనటులు : ఆమీర్ ఖాన్సాక్షి తన్వర్ఫాతిమా సన షేక్జైరా వసీంసాన్య మల్హోత్రా తదితరులు
డైరెక్టర్ : ప్రీతమ్
డైరెక్టర్ : నితేష్ తివారి
ప్రొడ్యూసర్ : అమీర్ ఖాన్కిరణ్ రావ్సిద్ధార్థ్ రాయ్ కపూర్
రిలీజ్ డేట్ : డిసెంబర్ 21, 2016

తన లైఫ్ లో గోల్డ్ మెడల్ సాధించలేదని దిగులుగా ఉన్నాతన కూతుళ్ళను ప్రపంచం గుర్తించే స్థాయిలో బాక్సింగ్ చాంపియన్ చేసే ఒక తండ్రి కథే దంగల్. కథ ప్రాధాన్యత ఉన్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందింది.