క్రిష్ ఇక హిస్టరీ వదిలినట్టేనా...?

Friday,March 08,2019 - 03:18 by Z_CLU

క్రిష్ సినిమాలకి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఫస్ట్ మూవీ ‘గమ్యం’ నుండి గమనిస్తే ‘కంచె’ వరకు హ్యూమన్ వ్యాల్యూస్ ని గుర్తు చేసేవే. అందుకే క్రిష్ మంచి సినిమాలు చేస్తాడు అనే ఒక ఒపీనియన్ ఉంది ఆడియెన్స్ లో. అయితే ఎందుకో ఈ మధ్య ఫ్యూచర్ డిఫైన్ చేసే సినిమాలు కాకుండా, కంప్లీట్ గా వెనకబడిపోతున్నాడు క్రిష్. వెనకబడిపోవడం అంటే ఫామ్ లో లేడు అని కాదు, జరిగిన కథలతోనే సినిమాలు చేస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే గత నాలుగేళ్ళుగా పాస్ట్ లైఫ్ టైమ్ జోన్ లోనే ఉంటున్నాడు క్రిష్.

కంచె :   వరల్డ్ వార్ 2 బ్యాక్ డ్రాప్ లో సినిమా. సినిమా రిలీజైన తరవాత ఆడియెన్స్ కి కనెక్ట్ అవ్వడానికి కొంచెం టైమ్ పట్టింది కానీ, దర్శకుడిగా క్రిష్ కి ఒక స్థాయిని కల్పించింది ఈ సినిమా. 1936 లో దేశంలో ఉన్న పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు చూపించాడు క్రిష్.

గౌతమీపుత్ర శాతకర్ణీ : బాలయ్య 100 వ చిత్రం. 2 వ శతాబ్దంలోని శాతవాహన రాజు ‘గౌతమీపుత్ర శాతకర్ణీ’ కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. దేశంలోని 32 రాజ్యాలను ఒకే తాటి మీదికి తీసుకురావాలనే శాతకర్ణీ లక్ష్యం, దాన్ని సాధించడం కోసం ఆయన చేసిన కృషే ఈ సినిమా.

NTR బయోపిక్: ఇది కూడా గడిచిన కథే. తెలుగునాట యుగ పురుషుడు అనిపించుకున్న NTR రియల్ లైఫ్ ఆధారంగా తెరకెక్కిందే ఈ సినిమా. ఆయన సినిమా లైఫ్ ని ఎలివేట్ చేస్తూ, NTR కథానాయకుడు రిలీజ్ అయితే, పొలిటికల్ లైఫ్ ని ఎలివేట్ చేస్తూ NTR మహానాయకుడు తెరకెక్కింది.

 

మణికర్ణిక : రాణి లక్ష్మీబాయ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిందీ సినిమా. ఇది కూడా హిస్టరీ బేస్డ్ కథే. ఈ కథతో గతంలో కూడా కొన్ని సినిమాలు రిలీజైనా క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా మాత్రం స్పెషల్ గా నిలిచింది. గ్రాండియర్ కాన్వాస్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో రాణి లక్ష్మీబాయ్ గా కంగనా రనౌత్ నటించింది.

క్రిష్ నెక్స్ట్ సినిమా కూడా హిస్టరీ బేస్డ్ ఎంటర్టైనరేనా..? గడిచిన కథతోనే సినిమా ప్లాన్ చేస్తాడా..? లేకపోతే కొంచెం టైమ్ తీసుకునైనా సరే, గతంలోలా తన స్టైల్ సినిమాలతో సెట్స్ పైకి వస్తాడా..? ప్రస్తుతం బ్రేక్ మోడ్ లో ఉన్న ఈ దర్శకుడి మైండ్ లో ఏం నడుస్తుందో  ఇంకొన్ని రోజులు ఆగితే కానీ తేలదు.