వరుణ్ తేజ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్

Wednesday,August 15,2018 - 10:37 by Z_CLU

ఇండిపెండెన్స్ డే సందర్భంగా వరుణ్ తేజ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజయింది. అఫీషియల్ అనౌన్స్ మెంట్ కి ముందుగానే అందరూ ఎక్స్ పెక్ట్ చేసినట్టు ఈ సినిమాకి అంతరిక్షం అనే టైటిల్ ని ఫిక్స్ అయ్యారు ఫిల్మ్ మేకర్స్. ఇకపోతే దానికి క్యాప్షన్ గా పెట్టిన 9000 KMPH ని బట్టి అది సినిమాలో ఆస్ట్రోనాట్స్ టీమ్ వాడే రాకెట్ అని తెలుస్తుంది.

ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని డిసెంబర్ 21న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు ఫిల్మ్ మేకర్స్. సినిమా స్టోరీలైన్ ఏ మాత్రం రివీల్ చేయకుండా సస్పెన్స్ మెయిన్ టైన్ చేస్తున్న ‘అంతరిక్షం’ టీమ్, ఈ సినిమాను హాలీవుడ్ స్థాయి టెక్నాలజీతో ప్రెజెంట్ చేయనున్నారు.

ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన అదితి రావు హైదరి తో పాటు లావణ్య త్రిపాఠి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సంకల్ప్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ స్పేస్ ఎంటర్ టైనర్ ని రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రశాంత్ విహారి మ్యూజిక్ కంపోజర్.