మెగాస్టార్ 'సైరా' టీజర్ రిలీజ్ కి రెడీ

Wednesday,August 15,2018 - 11:45 by Z_CLU

టాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘సైరా’ టీజర్ ఆగష్టు 21  న 11 : 30 కి  రిలీజవుతుంది. ఇండి పెండె న్స్ డే సందర్భంగా ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు ఫిలిమ్  మేకర్స్.  సురేందర్ రెడ్డి డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి ఎలా కనిపిస్తాడోనన్న క్యూరియాసిటీ ఇప్పటికే నెక్స్ట్ లెవెల్ లో క్రియేట్ అయి ఉంది. దాంతో ఈ టీజర్ ని  ఎలాంటి ఎగ్జై టింగ్ ఎలిమెంట్స్ తో ప్రెజెంట్ చేస్తారో నన్న ఆంగిల్ లో  సోషల్ మీడియాలో ఆల్రెడీ డిస్కర్షన్స్ బిగిన్ చేసేశారు మెగా ఫ్యాన్స్.

రీసెంట్ గా సినిమాలోని భారీ యాక్షన్ ఎపిసోడ్ ని తెరకెక్కించిన ఫిల్మ్ మేకర్స్,   భారీ బడ్జెట్ తో  ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.  తొలి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో చిరు సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. తమన్నా మరో ఇంట్రెస్టింగ్ రోల్ లో కనిపించనుంది. సినిమాను నెక్స్ట్ ఇయర్  సమ్మర్ లో విడుదల చేయాలనుకుంటున్నారు.