జీ సినిమాలు : 16th డిసెంబర్

Tuesday,December 15,2020 - 10:00 by Z_CLU

భానుమతి & రామకృష్ణ 

నటీనటులు – నవీన్ చంద్ర, సలోనీ లూథ్రా, షాలినీ, రాజా చెంబోలు, వైవా హర్ష

సంగీత దర్శకుడు – శ్రావణ్ భరధ్వాజ్

దర్శకుడు – శ్రీకాంత్ నాగోతి

నిర్మాత – యశ్వంత్ ములుకుట్ల

రిలీజ్ డేట్ – జులై 3, 2020

భానుమతి (సలోని లూత్రా) సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువగా ఉన్న అమ్మాయి. హైదరాబాద్‌లోని ఓ యాడ్ ఏజెన్సీలో మేనేజర్‌గా పనిచేస్తుంటుంది. రామ్ (రాజా చెంబోలు)తో ఐదేళ్లుగా లవ్ లో ఉంటుంది. అయితే, వయసు ఎక్కువగా ఉందని భానుమతికి రామ్ బ్రేకప్ చెబుతాడు. దీంతో భానుమతి చాలా డిస్టర్బ్ అవుతుంది. లైఫ్ లో మరింత ఎగ్రెసివ్ గా, కోపంగా మారిపోతుంది. సరిగ్గా అదే సమయంలో తెనాలి నుంచి రామకృష్ణ (నవీన్ చంద్ర) హైదరాబాద్‌కు వస్తాడు. భానుమతి పనిచేసే కంపెనీలో చేరతాడు. భానుమతి లైఫ్‌స్టైల్‌కు పూర్తి రివర్స్ లో ఉంటుంది రామకృష్ణ జీవితం. ఉత్తర-దక్షిణ దృవాల్లాంటి వీళ్లిద్దరు ఎలా కలిశారు.. ఎలా ప్రేమలో పడ్డారు.. చివరికి ఏమైంది అనేది ఈ సినిమా స్టోరీ.

______________________________________________

ఒంగోలు గిత్త

నటీనటులు : రామ్ పోతినేనికృతి కర్బందా

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్కిషోర్ దాస్ప్రభుఅజయ్అభిమన్యు సింగ్ఆహుతి ప్రసాద్రమాప్రభరఘుబాబుసంజయ్ రెడ్డి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : G.V. ప్రకాష్ కుమార్

డైరెక్టర్ : భాస్కర్

ప్రొడ్యూసర్ : B.V.S.N. ప్రసాద్

రిలీజ్ డేట్ : 1 ఫిబ్రవరి 2013

రామ్ కరియర్ లోనే అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఒంగోలుగిత్త. పసితనంలో తన తండ్రికి జరిగిన అన్యాయానికిఆ కుట్ర వెనక దాగిన పెద్ద మనిషి అసలు రంగును బయటపెట్టడానికి వచ్చిన యువకుడిలా రామ్ అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలో కృతి కర్బందా హీరోయిన్ గా నటించింది.

_________________________________________

memu-zee-cinemalu-427x320

మేము

నటీనటులు : సూర్యఅమలా పాల్
ఇతర నటీనటులు : రామ్ దాస్కార్తీక్ కుమార్విద్యా ప్రదీప్బిందు మాధవినిశేష్వైష్ణవి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : ఆరోల్ కోలేరి
డైరెక్టర్ : పాండిరాజ్
ప్రొడ్యూసర్స్ : సూర్యపాండిరాజ్
రిలీజ్ డేట్ : 24th డిసెంబర్ 2015


పిల్లల్లో హైపర్ ఆక్టివిటీని ఎలా హ్యాండిల్ చేయాలి అనే సెన్సిటివ్ టాపిక్ తో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మేము. ఈ సినిమాలో సూర్యఅమలా పాల్ నటన హైలెట్ గా నిలిచింది.

___________________________________________

అర్జున్ సురవరం

నటీ నటులు : నిఖిల్ , లావణ్య త్రిపాటి

సంగీతం : సామ్ CS

కెమెరామెన్ : సూర్య

రచన -దర్శకత్వం : T సంతోష్

అర్జున్ లెనిన్ సురవరం అనే క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా నిఖిల్ ఇందులో మోస్ట్ పవర్ ఫుల్ గా కనిపించాడు. ఫేక్ సర్టిఫికేట్స్ స్కామ్ ను అర్జున్ ఎలా ఛేదించాడనే ఇంట్రెస్టింగ్ పాయింట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు.

_______________________________________________

మణికర్ణిక

నటీనటులు : కంగనా రనౌత్, మొహమ్మద్ జీషన్ అయ్యుబ్

ఇతర నటీనటులు : అతుల్ కులకర్ణి, జీషు సేన్ గుప్తా, రిచర్డ్ కీప్, సురేష్ ఒబెరాయ్, డానీ డెన్ జోంగ్ పా, అంకిత లోఖాండే తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శంకర్ – ఎహసాన్- లాయ్

డైరెక్టర్ : క్రిష్

ప్రొడ్యూసర్ : జీ స్టూడియోస్, కమాల్ జైన్, నిశాంత్ పిట్టి

రిలీజ్ డేట్ : 25 జనవరి 2019

మహారాణి ఝాన్సీ లక్ష్మీబాయ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా మణికర్ణిక. ఝాన్సీ రాజ్యాన్ని బ్రిటీషు వారి బారిన పడకుండా లక్ష్మీ బాయ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది..? తన ప్రజలను కలుపుకుని వారిపై ఎలా తిరగబడింది అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం. యుద్ధ సన్నివేశాలు సినిమాలో హైలెట్ గా నిలిచాయి.