ఒకే ఆఫర్ కోసం ముగ్గురు హీరోయిన్లు పోటీ

Saturday,February 16,2019 - 03:46 by Z_CLU

సినిమా ఒక్కటే. కానీ దానికి పోటీ మాత్రం తీవ్రంగా ఉంది. అందులో హీరోయిన్ గా నటించడం కోసం ఏకంగా ముగ్గురు ముద్దుగుమ్మలు పోటీపడుతున్నారు. కాంపిటిషన్ చాలా టఫ్ గా ఉంది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా? అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న మూవీ.

అవును.. ఈ సినిమాలో ఛాన్స్ కోసం పూజా హెగ్డే రేసులో నిలిచింది. అరవింద సమేతలో పూజ టాలెంట్ చూశాడు త్రివిక్రమ్. అందుకే ఆమెనే మరోసారి రిపీట్ చేయాలని భావిస్తున్నాడు. కానీ పూజాతో బన్నీ ఇప్పటికే డీజే సినిమా చేశాడు. మళ్లీ ఛాన్స్ ఇస్తాడా అనేది అనుమానం.

ఇక రేసులో రష్మిక కూడా ఉంది. గీతగోవిందం, దేవదాస్ సినిమాలతో ఈమె కెరీర్ ఊపందుకుంది. యాక్టింగ్ లో కూడా టాలెంట్ చూపిస్తోంది. సో.. ఈమె పేరు కూడా పరిశీలనలో ఉంది. దేనికైనా మంచిది అప్పుడే మరో సినిమాకు కమిట్ అవ్వొద్దని గీతా కాంపౌండ్ నుంచి రష్మికకు మెసేజ్ కూడా వెళ్లిందంటున్నారు

ఇక లాస్ట్ లో చెప్పుకుంటున్నా ఏమాత్రం తక్కువ చేయడానికి వీల్లేని భామ కియరా అద్వానీ. భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, రీసెంట్ గా చరణ్ సరసన వినయ విధేయ రామ సినిమా చేసింది. ఇలా స్టార్ హీరోలే టార్గెట్ గా దూసుకుపోతున్న కియరా.. బన్నీ-త్రివిక్రమ్ మూవీ కోసం కాస్త గట్టిగానే ప్రయత్నిస్తోంది.

సో.. అల్లు అర్జున్-త్రివిక్రమ్ సినిమాలో వీళ్ల ముగ్గుర్లో ఒకర్ని హీరోయిన్ గా తీసుకునే ఛాన్స్ ఉంది. ఆ ఒక్కరు ఎవరనేది వచ్చే నెలలో తేలిపోతుంది.