దర్శకుడే కాదు, హీరోయిన్ ను కూడా మార్చేశారు!

Saturday,February 16,2019 - 02:01 by Z_CLU

తన సినిమాలతో ఏకంగా నేషనల్ అవార్డ్ అందుకున్నాడు దర్శకుడు బాల. అలాంటి దర్శకుడ్ని తొలిగించి సంచలనం సృష్టించింది E4 ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్. అర్జున్ రెడ్డి సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న వర్మ తమిళ సినిమా ఔట్ పుట్ బాగాలేదంటూ బాలను పక్కనపెట్టింది. ఇప్పుడు హీరోయిన్ వంతు

అవును.. ఈ ప్రాజెక్టు నుంచి హీరోయిన్ ను కూడా తొలిగించారు. లెక్కప్రకారం వర్మ సినిమాతో మేగ చౌదరి హీరోయిన్ గా పరిచయం కావాలి. కానీ ఆమె స్థానంలో మరో బెంగాలీ బ్యూటీ వనిత సంధును హీరోయిన్ గా తీసుకున్నారు. త్వరలోనే ధృవ్-వణిత హీరోహీరోయిన్లుగా వర్మ సినిమా రీషూట్ ప్రారంభం అవుతుంది.

తెలుగుతో పోలిస్తే తమిళ వెర్షన్ లో ఫీల్ మిస్ అయిందట. పైగా ఇది విక్రమ్ కొడుకు ధృవ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న మూవీ. అందుకే ఇన్ని మార్పుచేర్పులు. వీలైనంత త్వరగా రీషూట్స్ పూర్తిచేసి, జూన్ లో వర్మను రిలీజ్ చేస్తామంటున్నారు నిర్మాతలు.