జీ సినిమాలు ( 17th ఫిబ్రవరి )

Saturday,February 16,2019 - 11:28 by Z_CLU

త్రిపుర
నటీనటులు : స్వాతి రెడ్డి, నవీన్ చంద్ర
ఇతర నటీనటులు : రావు రమేష్, సప్తగిరి, శివన్నారాయణ నడిపెద్ది, జయ ప్రకాష్ రెడ్డి, ప్రీతీనిగమ్ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : కామ్రాన్
డైరెక్టర్ : రాజ్ కిరణ్
ప్రొడ్యూసర్స్ : A. చినబాబు & రాజశేఖర్
రిలీజ్ డేట్ : 6 నవంబర్ 2015
స్వాతి లీడ్ రోల్ ప్లే చేసిన త్రిపుర పర్ఫెక్ట్ ఇమోషనల్ హారర్ థ్రిల్లర్. పల్లెటూరిలో పెరిగినత్రిపురకు చిన్నప్పటి నుండి తన చుట్టూ పక్కల జరగబోయే ఇన్సిడెంట్స్ గురించి కలలువస్తుంటాయి. అవి కాస్తా నిజమవుతుంటాయి. దాంతో త్రిపురకు ట్రీట్ మెంట్ కోసమని సిటీకితీసుకువస్తారు. అక్కడ నవీన్ చంద్ర, త్రిపురలు ప్రేమలో పడతారు, పెళ్ళి కూడాచేసేసుకుంటారు. ఆ తరవాత ఏం జరుగుతుందనేదే సినిమా ప్రధాన కథాంశం. సస్పెన్స్ఎలిమెంట్ సినిమాలో హైలెట్ గా నిలిచింది.

==============================================================================

సుడిగాడు
నటీనటులు : అల్లరి నరేష్, మోనాల్ గజ్జర్
ఇతర నటీనటులు : బ్రహ్మానందం, ఆలీ, M.S. నారాయణ, రఘుబాబు, వేణు మాధవ్, చంద్ర మోహన్, చలపతి రావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీ వసంత్
డైరెక్టర్ : భీమనేని శ్రీనివాస రావు
ప్రొడ్యూసర్ : చంద్రశేఖర్ D రెడ్డి
రిలీజ్ డేట్ : 24 ఆగష్టు 2012
అల్లరి నరేష్ నటించిన స్పూఫ్ కామెడీ చిత్రం సుడిగాడు. భీమనేని శ్రీనివాస రావు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా పక్కా కామెడీ ఎంటర్ టైనర్ అనిపించుకుంది. అల్లరి నరేష్,  బ్రహ్మానందం కాంబినేషన్ లోని కామెడీ సీన్స్ సినిమాకే హైలెట్.

==============================================================================

బొమ్మరిల్లు
నటీనటులు : సిద్ధార్థ్, జెనీలియా
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, జయసుధ, సత్య కృష్ణన్, సుదీప పింకీ, సురేఖా వాణి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్
డైరెక్టర్ : భాస్కర్
ప్రొడ్యూసర్ : దిల్ రాజు
రిలీజ్ డేట్ : 9 ఆగష్టు 2006
తండ్రి కొడుకుల అనుబంధాన్ని అద్భుతంగా తెరకెక్కించిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ బొమ్మరిల్లు. న్యాచురల్ పర్ఫామెన్స్ అలరించిన జెనీలియా, సిద్ధార్థ్ పర్ఫామెన్స్ సినిమాకే హైలెట్. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకే హైలెట్.

==============================================================================

బ్రహ్మోత్సవం
నటీనటులు : మహేష్ బాబు, సమంత రుత్ ప్రభు, కాజల్ అగర్వాల్
ఇతర నటీనటులు : ప్రణీత సుభాష్, నరేష్, సత్యరాజ్, జయసుధ, రేవతి, శుభలేఖ సుధాకర్ మరియు తదితరులు…
మ్యూజిక్ డైరెక్టర్స్ : మిక్కీ జె. మేయర్, గోపీ సుందర్
డైరెక్టర్ : శ్రీకాంత్ అడ్డాల
ప్రొడ్యూసర్ : ప్రసాద్ V. పొట్లూరి
రిలీజ్ డేట్ :  20 మే 2016
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘బ్రహ్మోత్సవం.’ కుటుంబ విలువలను వాటి ఔన్నత్యాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించిన ఈ సినిమాలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మహేష్ బాబును సరికొత్త ఆంగిల్ లో ప్రెజెంట్ చేశాడు. ఎప్పటికీ తన కుటుంబ సభ్యులు కలిసి మెలిసి ఉండాలన్న తన తండ్రి ఆలోచనలు పుణికి పుచ్చుకున్న హీరో, తన తండ్రి కలను ఎలా నేరవేరుస్తాడు అన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

==============================================================================

కొంచెం ఇష్టం కొంచెం కష్టం
నటీనటులు : సిద్ధార్థ, తమన్నా
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, నాజర్, వేణు మాధవ్, సుధ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : శంకర్-ఎహసాన్-లాయ్
డైరెక్టర్ : కిషోర్ కుమార్ పార్ధసాని
ప్రొడ్యూసర్ : నల్లమలుపు శ్రీనివాస్
రిలీజ్ డేట్ : 5 ఫిబ్రవరి 2009
పై చదువుల కోసమని సిటీకి వచ్చిన గీత, అక్కడే ఉండే సిద్ధు ప్రేమించుకుంటారు. ఎప్పుడైతే సిద్ధూ తమ ప్రేమ గురించి గీత ఫాదర్ కి చెప్తాడో, అప్పుడు సిద్ధూ తల్లిదండ్రులు కలిసి ఉండటం లేదు అనే ఒకే కారణంతో, ఈ పెళ్లి జరగదని తేల్చి చెప్పేస్తాడు. అసలు సిద్ధూ తల్లిదండ్రులు విడిపోవడానికి కారణం ఏంటి..? తన ప్రేమను దక్కించుకోవడానికి సిద్ధూ ఏం చేస్తాడు అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

==============================================================================

కాష్మోరా
నటీనటులు : కార్తీ, నయనతార
ఇతర నటీనటులు : సి.దివ్య, శరత్ లోహిత్ వాలా, మధుసూదన్ రావు, పట్టిమంద్రం రాజా మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : సంతోష్ నారాయణన్
డైరెక్టర్ : గోకుల్
ప్రొడ్యూసర్ : S.R. ప్రకాష్ బాబు, S.R. ప్రభు
రిలీజ్ డేట్ : 28 అక్టోబర్ 2016
ప్రజల బలహీనతను వాడుకుంటూ దొంగ బాబాగా జీవితాన్ని కొనసాగించే కాష్మోరా(కార్తీ) కు అతని మంత్రశక్తులకు లోబడిన మినిస్టర్ అండదండగా నిలుస్తాడు. అలా దొంగ బాబాగా ప్రజల నుండి డబ్బు దండుకునే కాష్మోరా అనుకోకుండా రాజ్ నాయక్(కార్తీ) అనే ఓ ప్రేతాత్మ తో ఓపాడుబడ్డ బంగ్లాలో బంధించబడతాడు. అసలింతకీ రాజ్ నాయక్ అనే ఆ ప్రేతాత్మ ఎవరు? అతను ఎందుకు ప్రేతాత్మగా మారాడు? ఆ ప్రేతాత్మకి.. ఈ కాష్మోరాకి సంబంధం ఏమిటి? చివరికి కాష్మోరా ఆ దుష్టశక్తీని ఏ శక్తితో ఎదిరించి అంతమొందించాడు? అనేది చిత్ర కథాంశం.