#Thalapathy66 విజయ్ , వంశీ పైడిపల్లి సినిమా ప్రారంభం
Wednesday,April 06,2022 - 04:41 by Z_CLU
దళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ బడ్జెట్ బైలింగ్వెల్ సినిమా ఈరోజే చెన్నైలో గ్రాండ్ గా లాంచ్ అయింది. నేటి నుంచే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది.
రష్మికా మందన్న ఈ సినిమాలో విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. విజయ్ 66 వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో భారీతారాగణం కనువిందు చేయనుంది. అత్యున్నత సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం పని చేయనున్నారు.
సూపర్ ఫామ్ లో ఉన్న సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ ఈ మ్యూజిక్ అందించనున్నారు. ఈ సినిమా కోసం ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే ఓ మంచి స్టోరీ సెట్ చేసుకున్నాడట వంశీ పైడిపల్లి.

వంశీ పైడిపల్లి తో పాటు హరి, అహిషోర్ సాల్మన్ కథ, స్క్రీన్ ప్లే లో పనిచేయగా, కార్తీక్ పళని ఛాయాగ్రాహకుడిగా, కెఎల్ ప్రవీణ్ ఎడిటర్ గా, శ్రీ హర్షిత్ రెడ్డి, శ్రీ హన్షిత సహ నిర్మాతలుగా, సునీల్ బాబు, వైష్ణవి రెడ్డి ప్రొడక్షన్ డిజైనర్లుగా పని చేస్తున్నారు.
భారీతారాగణం, అత్యున్నత సాంకేతిక బృందం కలసి పనిచేస్తున్న ఈ చిత్రం దళపతి విజయ్ కెరీర్లో భారీ అంచనాలు వున్న సినిమాగా రూపుదిద్దుకుంటుంది. మరిన్ని వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.
తారాగణం: విజయ్, రష్మికా మందన్న
సాంకేతిక విభాగం:
దర్శకత్వం: వంశీ పైడిపల్లి
కథ, స్క్రీన్ ప్లే: వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్ సాల్మన్
నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా
సహ నిర్మాతలు: శ్రీ హర్షిత్ రెడ్డి, శ్రీ హన్షిత
సంగీతం: ఎస్ థమన్
డీవోపీ: కార్తీక్ పళని
ఎడిటింగ్: కెఎల్ ప్రవీణ్
డైలాగ్స్, అడిషనల్ స్క్రీన్ ప్లే: వివేక్
ప్రొడక్షన్ డిజైనర్లు: సునీల్ బాబు, వైష్ణవి రెడ్డి
ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: బి శ్రీధర్ రావు, ఆర్ ఉదయ్ కుమార్
మేకప్: నాగరాజు
కాస్ట్యూమ్స్: దీపాలి నూర్
పబ్లిసిటీ డిజైన్స్: గోపి ప్రసన్న
వీఎఫ్ఎక్స్: యుగంధర్
పీఆర్వో: వంశీ-శేఖర్