#VNRTrio మెగాస్టార్ చిరంజీవి క్లాప్ తో

Friday,March 24,2023 - 04:25 by Z_CLU

Megastar Chiranjeevi Claps #VNRTrio Launched Grandly

‘భీష్మ’ సక్సెస్ తర్వాత వెంకీ కుడుముల, నితిన్, రష్మిక మందన మరో సినిమాతో రాబోతున్నారు. #VNRTrio గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది.

ఫన్నీ అనౌన్స్ మెంట్ వీడియోతో సినిమాపై బజ్ క్రియేట్ చేశాడు దర్శకుడు వెంకీ. ఆ వీడియో ద్వారా సినిమా ఎలా ఉండబోతుంది అనే క్యూరియాసిటీని క్రియేట్ చేశారు. అడ్వెంచరస్ ఎంటర్టైనయింగ్ మిక్స్ చేసి వెంకీ ఈ సినిమా తీయబోతున్నాడని అర్థమవుతుంది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా ఈ డెడ్లీ కాంబినేషన్‌ లోని క్రేజీ ప్రాజెక్ట్ గ్రాండ్‌ గా ప్రారంభమైయింది.

ముహూర్తం షాట్‌ కు మెగాస్టార్ చిరంజీవి క్లాప్‌ కొట్టగా, దర్శకుడు బాబీ కెమెరా స్విచాన్ చేశారు. గోపీచంద్ మలినేని తొలి షాట్‌ కి దర్శకత్వం వహించారు. హను రాఘవపూడి, బుచ్చిబాబు సాన స్క్రిప్ట్‌ ని మేకర్స్‌ కి అందజేశారు. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, సాయి శ్రీరామ్ కెమెరా మెన్ గా పని చేస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటర్, రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్.

 

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics