Pushpa 2 - పుష్ప-2 ఇంట్రెస్టింగ్ గ్లింప్స్

Wednesday,April 05,2023 - 02:15 by Z_CLU

Allu Arjun and Sukumar’s Pushpa The Rule glimpse Released

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన చిత్రం పుష్ప. ఈ సినిమా రికార్డుల గురించి కలెక్షన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

పుష్ప సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులపై చూపించిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. పుష్ప రాజ్ అనే క్యారెక్టర్ ను అద్భుతంగా డిజైన్ చేసి ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు దర్శకుడు సుకుమార్.

పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటించిన తీరు, డైలాగ్ డెలివరీ, వాయిస్ మాడ్యుకేషన్, యాటిట్యూడ్ ఇవన్నీ తెలుగు ప్రేక్షకులతో పాటు ప్రపంచాన్ని ఆకర్షించాయి. అప్పటివరకు తెలుగు, మలయాళ ప్రేక్షకులకు మాత్రమే సుపరిచితమైన అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులందరికీ రీచ్ అయ్యాడు.

ఇప్పుడీ క్రేజ్, అంచనాలకు తగ్గట్టుగా పుష్ప-2 వస్తోంది. ఈ మూవీ గ్లింప్స్ ను రీసెంట్ గా రిలీజ్ చేసింది చిత్రం యూనిట్.

ఈ గ్లిమ్ప్స్ లో ఆసక్తికరమైన విషయం ఏంటంటే “తిరుపతి జైలు నుండి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప” అని న్యూస్ వినిపిస్తుంది. ఆ తరువాత “అసలు పుష్ప ఎక్కడ” అంటూ వాయిస్ ఓవర్ వినిపిస్తుంది.

20 సెకన్ల ఈ వీడియో ఆసక్తికరంగా ఉంది. ఈ గ్లింప్స్ పూర్తి వీడియోను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా ఏప్రిల్ 7న సాయంత్రం 4:05 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు. ఆరోజున పుష్ప-2కు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రివీల్ కాబోతున్నాయి.

– Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics