Seetha Ramam - యుద్ధంతో రాసిన ప్రేమకథ

Monday,April 11,2022 - 12:40 by Z_CLU

Dulquer Salmaan’s Movie titled as Seetha Ramam

వెండితెరపై మర్చిపోలేని ప్రేమ కథలు తెరకెక్కించే దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కథానాయకుడి గా యుద్ధం నేపధ్యంలో అందమైన ప్రేమకథ చిత్రం రూపొందుతుంది. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్, ప్రియాంక దత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మృణాళిని ఠాకూర్ హీరోయిన్ పాత్రలో కనిపించగా రష్మిక మరో కీలకమైన పాత్రలో కనిపించనుంది.

శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రానికి ‘సీతారామం” అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు.’ ‘యుద్ధంతో’ రాసిన ప్రేమకథ” అనేది ఉపశీర్షిక. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ పంచుకున్న టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది.

టైటిల్ గ్లింప్స్ లో ”ఇది ఓ సైనికుడు శత్రుకి అప్పగించిన యుద్దం ఆఫ్రీన్. ఈ యుద్ధంలో సీతారాములని నువ్వే గెలిపించాలి’ అనే డైలాగ్ టైటిల్ తగ్గట్టు అద్భుతంగా వుంది. ఈ డైలాగ్ తర్వాత ఆఫ్రీన్ పాత్రలో రష్మిక రివీల్ కావడం, తర్వాత సీత పాత్రలో హీరోయిన్ మృణాళిని, రాముడి పాత్రలో దుల్కర్ సల్మాన్ కనిపించడం ఆసక్తికరంగా వుంది.

యుద్ధం నేపధ్యంలో సాగే ఈ ప్రేమ కథలో లెఫ్టినెంట్ రామ్ గా దుల్కర్ సల్మాన్ కనిపించనున్నాడు. టైటిల్ వీడియోలో దుల్కర్ సల్మాన్, మృణాళిని ఠాకూర్, రష్మిక అద్భుతంగా కనిపించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో వున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో రానుంది.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics